మగ బిడ్డకు జన్మనిచ్చిన యువ హీరోయిన్.. ఆ విషయం దాచి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బ్యూటీ
మలయాళ సినీ పరిశ్రమలో యువ నటి మియా జార్జ్ తన అభిమానులకు, సన్నిహితులకు, స్నేహితులకు శుభవార్తను అందించింది. జూలై 7వ తేదీన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను మియా జార్జ్, ఆమె భర్త అశ్విన్ ఫిలిప్స్ తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇన్స్‌టాగ్రామ్‌లో మగపిల్లాడికి జన్మనిచ్చానని చెబుతూ చిన్నారితోపాటు తమ కుటుంబ ఫోటోను షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకొన్నారు.
ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో.. మాకు మగబిడ్డ జన్మించాడు. లవ్లీ బుడత పేరు లుకా జోసెఫ్ ఫిలిప్ అంటూ మెసేజ్ చేశారు. అయితే ఈ వార్తతో సన్నిహితులు, అభిమానులు షాక్ గురి అవుతున్నారు. ఇప్పటి వరకు తాను గర్బవతిని అంటూ చెప్పుకుండా అనూహ్యంగా బిడ్డ పుట్టారనే విషయాన్ని వెల్లడించడంతో అందరూ విస్మయం చెందారు. ఈ సందర్భంగా మియా జార్జ్ దంపతులకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మియా జార్జ్ కెరీర్ విషయానికి వస్తే.. మలయాళం సినిమా రంగంలో ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్తున్నది. తొలుత ఆమె బుల్లితెరపై ఓరు స్మాల్ ఫ్యామిలీ అనే సీరియల్‌తో తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి విశుధన్, సలామ్ కశ్మీర్, అనార్కలి, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి చిత్రాల్లో తన అందం, అభినయంతో మెప్పించారు. ప్రస్తుతం విక్రమ్‌తో కలిసి కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మియా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. కేరళలో వ్యాపారవేత్త అయిన అశ్విన్ ఫిలిప్స్‌తో వివాహం జరిగింది. లాక్‌డౌన్‌లో సెప్టెంబర్ 12వ తేదీన నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నారు. వీరి వివాహానికి అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











