Suicide యువ నటి ఆత్మహత్య.. ఉరి వేసుకొని బలవన్మరణం.. కారణం ఏమిటంటే?

సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకొన్నది. వినోద రంగంలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న వర్థమాన తార ఆత్మహత్య చేసుకొన్నారు. ఆమె మరణం సినీ వర్గాలు, అభిమానులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. యువ నటి మృతివార్తతో దిగ్బాంతికి గురైన సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. యువ హీరోయిన్ మరణానికి సంబంధించిన కారణాల విషయాల్లోకి వెళితే..

మలయాళ హీరోయిన్ రెంజుషా మీనన్ మరణవార్త దక్షిణాది సినిమా పరిశ్రమను కుదిపేసింది. సోమవారం ఉదయం ఆమె మృ‌తివార్త సంచలనం రేపింది. ఆమె తన నివాసంలో ఉరివేసుకొని మరణించడం అత్యంత విషాదంగా మారింది. రెంజుషా మీనన్ మృతివార్తను ఆమె భర్త మనోజ్ మీడియాకు వెల్లడించారు. ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

Actress Renjusha Menon died hanging in her Flat at Thiruvananthapuram

మీడియా వర్గాల కథనం ప్రకారం.. రెంజూష మీనన్ మరణానికి కారణం ఆర్థిక సమస్యలే అనే విషయం తెలుస్తున్నది. ఆమె కుటుంబ కొద్దికాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆర్థిక సమస్యలే ఆమె మరణానికి కారణమా? మరమేనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె దేహాన్ని ప్రస్తుతం పోస్టు మార్టమ్‌కు తరలించి.. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

రెంజూష మీనన్ కెరీర్ విషయానికి వస్తే.. కోచీకి చెందిన ఆమె టెలివిజన్ షోల ద్వారా వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. టీవీ సీరియల్స్ నటిస్తూ మంచి పేరు తెచ్చుకొన్నారు. స్త్రీ అనే సినిమా ద్వారా ఆమె టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

Actress Renjusha Menon died hanging in her Flat at Thiruvananthapuram

రెంజూష మీనన్ నటించిన సినిమాల విషయానికి వస్తే.. సిటీ ఆఫ్ గాడ్, మేరిక్కుందోరు కుంజాడు, బాంబే మార్చ్, కార్యస్థాన్, ఒన్ వే టికెట్, అద్బుతద్వీపు తదితర సినిమాల్లో నటించారు. ఆమె ధరించిన పాత్రలు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువ చేశాయి.

Actress Renjusha Menon died hanging in her Flat at Thiruvananthapuram

అయితే ఇటీవల మలయాళ సినీ పరిశ్రమలో సూసైడ్ వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మలయాళ నటి అపర్ణ నాయర్ ఇటీవల ఆత్మహత్య చేసుకొన్నారు. అపర్ణ నాయర్ మృతి వార్త నుంచి తేరుకోక ముందే ప్రస్తుతం రంజూషా మీనన్ మృతివార్త మరింత విషాదాన్ని నింపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X