చావు బతుకుల్లో టెలివిజన్ నటి.. 11వ సర్జరీ తర్వాత మరింత విషమంగా...

టెలివిజన్ రంగంలో విశేషంగా ఆదరణ సంపాదించుకొన్న నటి శరణ్య శశి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమైన ఈ నటికి కరోనా రూపంలో మరోసారి కఠిన పరీక్ష ఎదురైంది. కష్టం కాలంలో తొలి నుంచి తనతోపాటు ఉంటున్న నటి సీమా నాయర్ శరణ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ...

అన్వేషి జైన్.. ఇంత హాట్ గా కనిపిస్తే కుర్రాళ్ళు తట్టుకుంటారా?

 2012లో బ్రెయిన్ ట్యూమర్‌తో

2012లో బ్రెయిన్ ట్యూమర్‌తో

టెలివిజన్ నటిగా శరణ్య శశి మంచి పాపులారిటీ సంపాదిస్తున్న సమయంలోనే 2012లో బ్రెయిన్ ట్యూమర్‌ వ్యాధికి గురయ్యారు. అప్పట నుంచి పలు సర్జరీలు, వైద్య చికిత్సలు, వాటి వల్ల కలిగే బాధలను అనుభవిస్తూ వస్తున్నారు. ఓ దశలో మంచానికి పరిమితమవుతుందా అనుకొనే స్టేజ్ నుంచి కోలుకొని మాములు మనిషిగా మారడంతో అందరూ సంతోషించారు.

 కోలుకొంటున్న సమయంలో కోవిడ్

కోలుకొంటున్న సమయంలో కోవిడ్

అలా శరణ్య శశి కోలుకొంటున్నారనే వార్తల మధ్య మరోసారి విధి ఆమెను వెక్కిరించింది. ప్రస్తుతం కోవిడ్‌19 పాజిటివ్ గురుయ్యారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతుంది. చాలా ఆందోళనకరంగా ఉంది అంటూ సన్నిహితులు పేర్కొంటున్నారు.

 11వ సర్జరీ తర్వాత

11వ సర్జరీ తర్వాత

శరణ్య‌ శశికి ప్రస్తుతం 11వ సర్జరీ జరిగింది. ఆమె ఆరోగ్య పూర్తిగా క్షీణించింది. సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. ఆ వ్యాధి వెన్నముక నుంచి శరీరమంతా పాకుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వెన్నముకకు మళ్లీ సర్జరీ చేయడం సాధ్యం కాదుని డాక్టర్లు తేల్చేశారు. ఆమెకు కీమో థెరపీ జూన్ 3వ తేదీన జరిపించాల్సి ఉంది అని సీమ తెలిపారు. శరణ్య పరిస్థితి ఇలా ఉండగా, ఆమె తల్లి, సోదరుడు కరోనావైరస్ బారిన పడ్డారు. వారిద్దరూ తిరువనంతపురం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. శరణ్య కుటుంబం కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నది అని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సీమ వెల్లడించారు.

బ్రెయిన్ ట్యూమర్ తర్వాత

బ్రెయిన్ ట్యూమర్ తర్వాత

బ్రెయిన్ ట్యూమర్ కారణంగా శరణ్య శశి ఈ మధ్యకాలంలో నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆమె చోటా ముంబై, థలప్పవు, బాంబే మార్చి 12, చాకో రాండమన్ చిత్రాల్లో నటించారు. ఎంతో ప్రతిభ ఉన్న శరణ్య శశి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Recommended Video

Sasi Lalitha Movie First Look Released By Kethireddy Jagadeeswara Reddy || Filmibeat Telugu
టెలివిజన్ నటిగా కెరీర్

టెలివిజన్ నటిగా కెరీర్

శరణ్య శశి కెరీర్ విషయానికి వస్తే.. 2006లో బాలచంద్ర మీనన్ సీరియల్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సూర్యోదయం సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు పొందారు. పలు తమిళ చిత్రాలతోపాటు మలయాళ సీరియల్స్ నటించారు. తన అద్భుతమైన అందం, అభినయంతో మలయాళంలో ప్రతీ ఒక్కరు శరణ్యను తమ ఇంటి సభ్యురాలిగా భావిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X