ఆయన మరణంతో ఒంటరినయ్యా.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. సితార ఎమోషనల్‌

దక్షిణాదిలో 80, 90 దశకాల్లో నటి సితార అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకొన్నారు. కొన్నేళ్లే వెండితెరపైన హీరోయిన్‌గా రాణించినప్పటికి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఆమె 47 ఏళ్ల వయసుకు చేరుకొన్నప్పటికీ సితార సింగిల్‌గానే ఉండిపోయారు. అయితే ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణాన్ని ఇటీవల టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పారంటే..

Recommended Video

Actress Sithara Shocking Secret On Her Marriage
 1986లో హీరోయిన్‌గా

1986లో హీరోయిన్‌గా

సితార కెరీర్ విషయానికి వస్తే.. మలయాళంలో కావేరి అనే చిత్రం ద్వారా 1986లో సినిమా పరిశ్రమకు పరిచయమ్యారు. ఆ తర్వాత విక్రమన్ దర్శకత్వం వహించిన పుదు వసంతం అనే సినిమా ద్వారా తమిళంలోకి ప్రవేశించారు. అలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాప్ హీరోలతో కలిసి 100కుపైగా చిత్రాల్లో నటించారు.

 యుక్త వయసులో పెళ్లిపై ఆలోచన లేదు

యుక్త వయసులో పెళ్లిపై ఆలోచన లేదు

తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలను సితార వెల్లడిస్తూ.. యుక్త వయసులో పెళ్లి చూసుకోవద్దని అనుకొన్నాను. అలా సినిమాలతో బిజీగా ఉండి పెళ్లి గురించి ఆలోచించలేదు. అలా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకొంటూ వచ్చాను. అంతలోనే నా జీవితం ఒక్క కుదుపుకు లోనైంది. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది అన్నారు.

 నాన్న మరణం తర్వాత

నాన్న మరణం తర్వాత

నా జీవితంలో నాన్న పరమేశ్వరన్‌ది చాలా కీలకమైన పాత్ర. నాన్నే నాకు ప్రపంచం. అలాంటి వ్యక్తి అనారోగ్యం పాలు కావడం, ఆయనను బతికించుకోవడానికి చాలా కష్టపడ్డాం. కానీ ఆయన మాకు దూరమయ్యారు. దాంతో ఓ రకమైన విషాదంలో కూరుకుపోయాం. ఆ తర్వాత జీవితం పట్ల ఆసక్తి అనిపించలేదు అని సితారా ఎమోషనల్ అయ్యారు.

నాన్న మరణంతో

నాన్న మరణంతో

నాన్న మరణం తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో పెళ్లి విషయం అలా మరుగున పడిపోయింది. జీవితంలో స్థిరపడాలనే ఆశ చచ్చిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికి సింగిల్‌గా మిగిలిపోయాను. ఇక దాని గురించి ఆలోచించడానికి తీరికలేదు, ఆసక్తి కూడా లేదు. ఇక ముందు కూడా పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు అని సితార చెప్పారు.

నటిగా బిజీగా మారుతున్న సితార

నటిగా బిజీగా మారుతున్న సితార

ప్రస్తుతం మళ్లీ సితార నటనపరంగా బిజీగా మారిపోయారు. మలయాళ, తమిళ, తెలుగులో పలు అవకాశాలను చేజిక్కించుకొంటున్నారు. సినిమాలే కాకుండా టెలివిజన్ సిరియల్స్‌లో నటిస్తున్నారు. నాకు నచ్చిన పాత్రలనే నేను ఎంపిక చేసుకొంటున్నాను. పాత్రల కోసం నేను వెంపర్లాడటం లేదు. మంచివి, నా మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నాను అని సితార చెప్పాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X