For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీరకట్టులో శృంగారం ఒలకబోసిన మళయాళ నటి.. జాకెట్ లేకుండా హాట్‌గా ఫొటోషూట్!

  |

  భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ తారలు అందరూ కూడా ఎవరింటికి వాళ్లు పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో నటీమణులు కొందరు తమ హాట్ ఫోటో షూట్స్ రిలీజ్ చేస్తూ కుర్రకారుని ఎంగేజ్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఒక మలయాళ నటి తాజాగా జాకెట్ లేకుండా ఫోటో షూట్ నిర్వహించి తన సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలను షేర్ చేసింది ఆ వివరాల్లోకి వెళితే

  బెడ్రూం సీన్లలో హాట్ హాట్‌గా అదితి .. ఎలాంటి జంకు లేకుండా యువ తార అలా..

  ట్రాన్స్ భామ

  ట్రాన్స్ భామ

  మలయాళ నటి శ్రీందా అంటే తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు. కానీ ట్రాన్స్ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా తెలుగులో డబ్ చేసి ఆహా వేదికగా రిలీజ్ చేయడంతో ఈ భామను తెలుగువాళ్లు కూడా గుర్తుపడతారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  ఆరోజుల్లోనే

  ఆరోజుల్లోనే

  చదువుకునే రోజుల నుంచి సినిమాలు అలాగే ఫోటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకున్న శ్రీందా ఉద్యోగం చేస్తున్నా సరే వాటి మీద ఆసక్తి తెచ్చుకోలేక పోయింది. ఈ క్రమంలోనే మంచి జీతంతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని ఆమె సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత అది అంత ఆశాజనకంగా లేకపోవడంతో టెలివిజన్ యాంకర్ గా కూడా పని చేసింది.

  మోడలింగ్ చేస్తూ

  మోడలింగ్ చేస్తూ

  అయితే తాను ఇలా వార్తలు చదవడానికి రాలేదని భావించిన శ్రీందా కొన్ని హెయిర్ ఆయిల్స్ అలాగే జ్యువలరీ బ్రాండ్స్ కి మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా చేస్తున్న సమయంలో ఆమెకు ఒక డాక్యుమెంటరీలో నటించే అవకాశం దక్కింది. ఆ డాక్యుమెంటరీలో ఆమె నటనను చూసి దర్శకుడు దిలీప్ నాయర్ ఆమెను దర్శకుడు ఆశిక్ అబూకి పరిచయం చేశారు. ఆయన తన తదుపరి సినిమా 22 ఎఫ్కె అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా మొదటి సినిమాతోనే ఆమె ఫహద్ ఫాసిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

  ఫహద్ ఫాజిల్ సినిమాతో

  ఫహద్ ఫాజిల్ సినిమాతో

  అయితే ఎంట్రీ ఆ సినిమాతో ఇచ్చింది కానీ ముందు రిలీజ్ అయిన సినిమా మాత్రం ఫోర్ ఫ్రెండ్స్ అనే సినిమా. ఆ సినిమాలో ఆయేషా అనే పాత్రలో నటించి మెప్పించింది శ్రీందా. ఆ తర్వాత మళ్లీ ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవసరం పడలేదు. దాదాపు పాతిక పైగా సినిమాలు మలయాళంలో ఆమె నటించింది. అయితే 2014లో రిలీజ్ అయిన 1983 అనే స్పోర్ట్స్ సినిమాలో ఆమె లీడ్ రోల్ లో నటించింది. సుశీల పాత్రలో నటించిన ఆమెకు మంచి గుర్తింపు దక్కింది.

   తమిళ్ లో సైతం

  తమిళ్ లో సైతం

  ఇక మలయాళ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నప్పుడే ఈ భామ తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది వెన్నిల వీడు అనే సినిమాలో ఆమె నెగిటివ్ క్యారెక్టర్ పోషించి మంచి పేరు తెచ్చుకుంది. చివరిగా ఆమె ట్రాన్స్ అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో మంచి పాత్ర పోషించింది.

  ప్రేమ పెళ్లి - విడాకులు

  ప్రేమ పెళ్లి - విడాకులు

  అయితే సినిమాల్లోకి రాకముందే అషబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ భామ కేవలం నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అయితే నాలుగేళ్ల ఆమె దాంపత్య జీవితానికి గుర్తుగా ఆమెకు అర్హన్ అనే కుమారుడు జన్మించాడు. ఇక సినిమాల్లో కాస్త స్థిరపడ్డానని భావించిన ఆమె సిజుఎస్ బావ అనే దర్శకుడిని వివాహమాడింది.

  Ravi Teja Praises Cult Classic 'Color Photo' Movie

  ఏమీ లేకుండా ఫోటోషూట్

  ఇక తాజా ఫోటోషూట్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉండే ఈ భామ తాజాగా జాకెట్టు లేకుండా ఒక ఫోటో షూట్ నిర్వహించింది. ఎలాంటి ఆచ్చాదన లేకుండా కేవలం చీరను అడ్డుగా పెట్టుకుని ఈ భామ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సంప్రదాయ ఆభరణాలు ధరించి చేతిలో ఒక గులాబీ పువ్వు పట్టుకున్న ఈ భామ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.

  English summary
  Actress Srinda Arhaan of Trance fame became hot topic in social media. she shares her stunning saree outfit are spreading like wildfire on social media. Clad in a traditional red saree, the actress pulled off the look wearing no blouse by accompanying traditional ornaments and a rose flower on her hand.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X