యువ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇన్స్‌టాగ్రామ్‌లో క్లారిటీ.. కారణం అదేనంటూ
ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ దెబ్బకు అన్ని వర్గాలు బెంబేలు ఎత్తుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, వేడుకలకు పుల్‌స్టాపులు పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా మారడంతో అన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ తన పెళ్లిని కూడా వాయిదా వేసుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

కరోనావైరస్ విజృంభిచడంతో
మలయాళంలో ప్రముఖ నటి ఊర్మిళ ఉన్న కూతురు వర్ధమాన తార ఉత్తర ఉన్ని వివాహ నిశ్చితార్థం గతేడాది జరిగింది. మార్చి నెలలో పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాయి. ఇంతలోనే కేరళలో కరోనా వైరస్ విజృంభించడంతో తన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కేరళ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలో జరిగే ఓ కార్యక్రమాన్ని అనుకొన్న తేదీకే నిర్వహిస్తున్నామని ఉత్తర తన ఇన్స్‌టాగ్రామ్‌లో తెలిపింది.

పెళ్లి వేడుకలు వాయిదా
ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్నదనే విషయం నాకు ఆందోళనగా మారింది. ఈ క్రమంలోనే పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు నా పెళ్లి వేడుకలను వాయిదా వేసుకొన్నాను. నా పెళ్లికి హాజరుకావడానికి అడ్వాన్సు టికెట్లు బుక్ చేసుకొన్నవారిని చూస్తే బాధగా ఉంది అని ఉత్తర ఉన్ని పేర్కొన్నారు.

తేదీలను ప్రకటిస్తానని వెల్లడి
నా పెళ్లిలో భాగంగా జరిగే తల్లికెట్టు అనే సంప్రదాయ వేడుకను నిర్ణయించిన తేదీనే ఆలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అది ఏ రోజు అనేది త్వరలోనే డేట్స్‌ను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు, నా అభిమానులను క్షేమంగా, సురక్షితంగా ఉండాలని కోరుకొంటున్నాను. ఈ ప్రపంచం కరోనావైరస్ బారి నుంచి బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఉత్తర ఉన్ని తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో తెలిపారు.
ఉత్తర ఉన్ని కెరీర్
తల్లి ఊర్మిళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నటిగా ఉత్తర ఉన్ని మలయాళం పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫుల్‌టైమ్ భరతనాట్యం డ్యాన్సర్‌గా రాణిస్తునే తనకు నచ్చిన పాత్రల్లో సినిమాల్లో కనిపిస్తున్నది. ఎడవప్పతి, వావ్వల్ పసంగా చిత్రాలు ఆమెకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవలే ప్రేమలో పడిన ఈ భామ..కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నది.


Click it and Unblock the Notifications











