పవన్ అడుగు జాడల్లో అకీరా నందన్.. సనాతన ధర్మ యాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం నేపథ్యంగా యాత్రను చేపట్టారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మంపై అవగాహన కల్పించడం, దానిని పరిరక్షించే దిశగా అడుగులు వేశాడు. సుమారు నాలుగు రోజులపాటు ఈ యాత్రను కేరళ, తమిళనాడులో నిర్వహించనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హిందూ మతం సంస్కృతి, విలువలను చాటి చెప్పేందుకు ఈ యాత్రను చేపట్టామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ యాత్ర కోసం బుధవారం ఉదయం కోచి విమానాశ్రయానికి చేరుకొన్నారు. పవన్ కల్యాణ్ వెంట తన కుమారుడు అకీరా, ఆయన ప్రాణ స్నేహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద సాయి తదితరులు ఉన్నారు. కోచి విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు.

Akira Nandan joins with Pawan Kalyan s Sanatan Dharma Yatra in Kerala and Tamil

సనాధన ధర్మం పరిరక్షణ యాత్రలో భాగంగా తొలుత కోచికి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకొన్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన వెంట అకీరా, ఆనందసాయి ఉన్నారు.

సనాతన ధర్మం యాత్రలో పవన్ కల్యాణ్ పలు దేవాలయాలను దర్శించుకొంటారు. అనంత పద్మనాభస్వామి ఆలయం, మధురై మీనాక్షి ఆలయం, శ్రీ పరుశురామ స్వామి టెంపుల్, అగస్త్య జీవ సమాధి, కుటుంబేశ్వర ఆలయం, స్వామి మలైా, తిరుతని సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకొంటారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

Akira Nandan joins with Pawan Kalyan s Sanatan Dharma Yatra in Kerala and Tamil

ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వెంట తన కుమారుడు అకీరా నందన్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తండ్రి అడుగుల్లో అడుగు వేస్తూ వినమ్రంగా కనిపించారు. సంప్రదాయ దుస్తులు అంటే పంచే, లాల్చీ వేసుకొని లక్షణంగా తండ్రి వెంట నడిచారు. తండ్రితోపాటు అకీరా పూజల్లో పాల్గొన్నారు. తండ్రికి అండగా నిలుస్తూ యాత్రలో భాగం కావడంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అకీరా నందన్ తెలుగు సినిమా ఎంట్రీ త్వరలోనే జరుగనున్నది. అయితే గెస్ట్ పాత్రలో ఓజీ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతారనే టాక్ నడస్తున్నది. త్వరలోనే అకీరా టాలీవుడ్ ఎంట్రీ జరుగుతుందనే కామెంట్ మెగా ఫ్యామిలీ నుంచి వినిపిస్తున్నది. త్వరలోనే సినీ వారసుడిగా అకీరా మెగా హీరో కావడం తథ్యమనే మాట అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నది.

More from Filmibeat

Read more about: akira nandan pawan kalyan kerala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X