ఆ నటుడు చీడపురుగు.. నా దుప్పట్లో దూరి.. కాసేపు పడుకోమని.. హీరోయిన్ ఆరోపణ
దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఊపందుకోవడంతో తమకు జరిగిన అన్యాయాలను హీరోయిన్లు బయటపెడుతున్నారు. గత కొద్దిరోజులుగా మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవల నటుడు ముఖేష్, సంగీత దర్శకుడు గోపి సుందర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటుడు అలెన్సియర్‌పై కూడా పేరు తెలియజేయడానికి ఇష్టపడని నటి తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో పలుమార్లు దారుణంగా ప్రవర్తించారని ఫేస్‌బుక్‌లో ఇండియా ప్రొటెస్ట్స్ అనే పేజ్ ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కారు.

అలెన్సియర్ చీడపురుగని
మలయాళ చిత్ర పరిశ్రమలో అలెన్సియర్ చీడ పురుగు. ఓ రోజు నా పడకగదిలోకి దూరి బెడ్ మీదకు వచ్చాడు. నా వీపు వెనుక భాగం వైపు వచ్చి పట్టుకొన్నాడు. ఏదో అలికిడి వినిపించడంతో షాక్ గురయ్యాను. నా పక్కకు వచ్చి నిద్ర పోతున్నావా? అని ప్రశ్నించాడు. దాంతో నాకు గుండె పగిలినంత పనైంది.

నా బెడ్‌పైకి వచ్చి
నా బెడ్‌పై అలెన్సియర్‌ను చూడగానే ఒక్క ఊదుటన బెడ్‌పై నుంచి దూకాను. అయితే అతను నా చేయిపట్టుకొని లాగాడు. నన్ను వెనకకు లాగి బెడ్‌పైన పడేశాడు. నా కోసం కొంత సేపు బెడ్‌పై పడుకోమని ఆయన చెవిలో గుసగుసలాడాడు. అతను వ్యవహరించిన తీరు చాలా దారుణం. ఆయన బయటకు కనిపించేది ఒకటి. లోపల ఆయన మనస్తత్వం మరొకటి అని ఆమె పేర్కొన్నారు.

రుతుస్రావంతో బాధపడుతూ
అలెన్సియర్ నన్ను వేధించిన సమయంలో నేను రుతుస్రావంతో బాధపడుతున్నాను. ఆరోగ్యం సహకరించకపోతే డైరెక్టర్ అనుమతితో విశ్రాంతి తీసుకోవడానికి రూమ్‌కు వచ్చాను. ఆ సమయంలోనే అలెన్సియర్ నా గదిలో వద్దకు వచ్చాడు. ఎవరా అని డోర్ రంధ్రంలో నుంచి చూస్తే అలెన్సియర్. దబదబామని డోర్‌పై కొట్టాడు. నేను డోర్ తీయగానే లోపలికి వచ్చాడు.

మరో మహిళతో నా రూమ్‌లోకి
నాతో దారుణంగా ప్రవర్తించిన తర్వాత అలెన్సియర్ నా గదిలోకి మరో మహిళతో వచ్చాడు. ఆమె శరీరాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. నా గురించి దారుణంగా మాట్లాడాడు. అందతా చూస్తే నాకు ఒళ్లు జలదరించింది. మరోసారి నాతో దారుణంగా ప్రవర్తించాడు.

నాతో మరోసారి దారుణంగా
అలెన్సియర్ చేదు అనుభవం జరిగే సమయానికి నేను నాలుగు సినిమాలు చేశాను. అలెన్సియర్‌తో నటించడం అదే మొదటిసారి. ఆ సినిమా షూటింగ్‌లోనే మరోసారి దారుణంగా ప్రవర్తించాడు. ఓ సారి లంచ్ చేస్తుండగా మహిళల గురించి చెడుగా మాట్లాడాడు. నా వక్షోజాలను గుచ్చి గుచ్చి చూడటం మొదలుపెట్టాడు. దాంతో అప్‌సెట్ అయ్యాను. ఆ తర్వాత ఆయనతో నటించలేదని ఆమె చెప్పారు.


Click it and Unblock the Notifications











