నా కళ్ల ముందే హస్త ప్రయోగం.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన యువ హీరోయిన్!

దక్షిణాదిలో అందం, అభినయంతోనే విలక్షణ నటనతో ఆకట్టుకొన్న యువ హీరోయిన్ అనశ్వర రాజన్. ఉదహరణం సుజాత అనే సినిమా ద్వారా బాలనటిగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ.. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నది. అయితే తాజాగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని స్వయంగా వెల్లడించింది. ఆ విషయం ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ అందాల భామకు ఎదురైన వేధింపులు ఏమిటి? ఈ టాలెంటెడ్ హీరోయిన్ గురించిన వివరాల్లోకి వెళితే..

బాలనటిగా కెరీర్ ఆరంభించిన అనశ్వర రాజన్ తొలిసారి థన్నీర్ మథాన్ డినంగల్ అనే సినిమా ద్వారా హీరోయిన్ అవతారం ఎత్తింది. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఆమె వరుస ఆఫర్లు దక్కించుకొన్నది. అధ్యరాత్రి మూవీలో ఏకంగా డబుల్ రోల్ చేసి మెప్పించింది. ఆ తర్వాత త్రిషతో కలిసి రాంగీ అనే చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది. అంతటితో ఆగకుండా యారియన్ 2 చిత్రం ద్వారా హిందీలోకి అడుగుపెట్టింది.

Anaswara Rajan revealed a man behaved inappropriately towards her Here is complete story

ఇదిలా ఉండగా, ఇటీవల వేధింపుల గురించి మాట్లాుతూ.. తనకు ఓ జర్నీలో జరిగిన విషయాన్ని పంచుకొన్నది. అప్పుడు నేను స్కూల్‌లో చదువుతున్నాను. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ దారుణమైన సంఘటనను చూశాను. బస్సులో చాలా తక్కువ మంది ఉన్నారు. నా స్నేహితురాలు కూడా నాతోనే ఉంది. అంతలో ఓ వ్యక్తి పిలిచినట్టు అనిపించింది. నేను వెనక్కి తీరిగి చూస్తే.. నా ముందే హస్త ప్రయోగం చేసుకొంటున్నాడు. అది చూసి నేను షాక్ గురయ్యాను అని ఆమె అన్నారు.

అయితే తన తల్లి కొన్ని విషయాలు ముందే చెప్పేది. ఎవరు ఎలా చేస్తారు.. ఎలా బిహేవ్ చేస్తే.. ఏం చేయాలనే విషయాన్ని చెప్పేవారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. దాంతో చిన్నప్పుడే ఎవరైనా నాతో తప్పుగా బిహేవ్ చేస్తే... జాగ్రత్త పడే దానిని. చిన్నతనంలో కొన్ని విషయాలు గుర్తొస్తే చాలా గుబులుగా ఉంటుంది అని అనశ్వర తెలిపారు.

Anaswara Rajan revealed a man behaved inappropriately towards her Here is complete story

అనశ్వర రాజన్ నటించిన అబ్రహం ఓజ్లర్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని ఆమె ఫెర్ఫార్మెన్స్ ప్రతిభకు అద్దం పట్టింది. ఇటీవల కాలంలో గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా.. పెర్ఫార్మెన్స్ ఇచ్చే నటిగా గుర్తింపు తెచ్చుకొన్నది.

ఇక అనశ్వర రాజన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిస్ బ్యాచ్‌లర్, రేఖా చిత్రం, ఓరు పెరుంగలియాట్టామ్, ఎన్ను స్వాంతామ్ పన్యాలన్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. అయితే ఈ అందాల భామ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పలువురు కొన్ని కథలను వినిపిస్తే.. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Read more about: anaswara rajan malayalam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X