విడాకులు తీసుకుంటున్న ప్రముఖ యాంకర్... కుప్పకూలిన 11 ఏళ్ల దాంపత్యం!
సింగర్, హోస్ట్ రిమి టోమీ... మలయాళ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ పర్సనాలిటీ. తాజాగా ఈ యాంకర్ ఎవరూ ఊహించని వార్తలతో మీడియాకెక్కారు. రిమి తన భర్త రోయిస్‌తో విడాకులు తీసుకుంటున్న విషయం బయటకు లీకైంది. ఈ విషయంలో ఇద్దరు ఒక పరస్పర అంగీకారానికి వచ్చారని, విడిపోవాలని నిర్ణయించుకున్నారని టాక్.
ఏప్రిల్ 16న తేదీనే ఎర్నాకులం ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ విడాకుల పిటీషన్ వేశారు. మలయాళ సినీ పరిశ్రమలో ఆదర్శ దంపతులుగా అన్యోన్య జీవితం సాగించిన వీరు విడిపోతున్నారనే విషయం తెలిసి అభిమానులుంతా షాకయ్యారు.

11 ఏళ్ల సంసార జీవితం కుప్పకూలింది
రిమి, రోయిస్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఇద్దరూ గత ఆరు నెలలుగా విడివిగానే ఉంటున్నారట. అయితే ఎవరికీ వీరి మధ్య గొడవలు ఉన్నట్లు అనుమానం రాలేదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనేది బయటకు రావాల్సి ఉంది.

ఆరు నెలలుగా సోషల్ మీడియాలో ఒక్క పోస్టు లేదు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిమి ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లో తరచూ తన ఫోటోలతో పాటు... తన భర్త రోయిస్‌తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అయిగే గత 6 నెలల్లో తన భర్తతో కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా రిమి షేర్ చేయలేదు.

2008లో వివాహం
రిమి, రోయిస్ వివాహం ఏప్రిల్ 27, 2008లో జరిగింది. ఇద్దరిదీ ప్రేమ వివాహం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కేవలం కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సవ్యంగా సాగుతున్న వీరి దాంపత్యం ముక్కలవ్వడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.

టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి
రిమి టోమీ టెలివిజన్ యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టారు. 2002లో వచ్చిన ‘మీసా మాధవన్' మూవీలో ఓ పాట పాడటంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయ్యారు. సింగర్‌గా పలు చిత్రాల్లో దాదాపు 50 పాటలు పాడటంతో పాటు ఏషియా నెట్ ఛానల్‌లో పలు షోలను హోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











