నా ప్రియుడు యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. సహజీవనంతో కష్టాల్లో హీరోయిన్

మలయాళ నటి అంజలీ అమీర్ గురించి చాలా కొద్ది మందికి తెలుసు. ఈ మధ్య మలయాళ మెగాస్టార్ పెరంబూ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించిన అంజలీ అమీర్ ఓ ట్రాన్స్‌జెండర్. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. సినిమాలో నటిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గా అంజలీ అమీర్ పేరు సంపాదించుకుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వస్తోన్న అంజలీ తాజాగా విస్తుపోయే విషయాలను వెల్లడించింది.

 బిగ్‌బాస్ షోతో ఫేమస్..

బిగ్‌బాస్ షోతో ఫేమస్..

గతేడాది మలయాళంలో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో అంజలీ అమీర్‌ పాల్గొంది. ఈ షో ద్వారా మరి కొంత మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆపై అంజలికి సినిమాల్లో అవకాశాలు కూడా పెరిగాయి.

Recommended Video

#CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
మమ్ముట్టి చిత్రంలో అవకాశం..

మమ్ముట్టి చిత్రంలో అవకాశం..

తాజాగా మమ్ముట్టి హీరోగా నటించిన పెరంబు చిత్రం తమిళ నాట మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీలో అంజలి కూడా ఓ ప్రత్యేక ప్రాతను పోషించింది. ఈ సినిమా ద్వారా అంజలికి నటిగా మంచి పేరు వచ్చింది.

సహజీవనంతో కష్టాల పాలు..

సహజీవనంతో కష్టాల పాలు..

తాను సహ జీవనం చేస్తోన్న వ్యక్తి తనను బాధ పెడుతున్నాడంటూ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి మొరపెట్టుకుంది అంజలి. బ్రేకప్ చెబితే తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు కాజేశాడని, తన మీదే పడి బతుకుతున్నాడని, తిరిగివ్వమంటే బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చింది.

యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులు..

తనతో వేగలేక విడిపోదామని చెబితే.. యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడని కన్నీరు మున్నీరైంది. ఆమెకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలనుకున్నట్లు తెలిపింది.

బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు..

బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు..

ఆమె తన జీవిత చరిత్రను బయోపిక్‌గా తీయాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఆమె తన పాత్రను తానే పోషించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X