సొంత ఇంట్లోనే కమల్ లైంగిక వేధింపులు.. అసభ్య ప్రవర్తనపై హీరోయిన్ ఆవేదన?

మీటూ ఉద్యమం మొదలైన కొత్తలో ఒక్కసారిగా కొంతమంది సీనియర్ దర్శకుల బాగోతాలు బయటపడ్డాయి. అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు కొందరు ఆరోపణలు చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే కొందరు నిజంగా వారికి జరిగిన చేదు అనుభవాల గురించి బయటపెడుతుంటే మరికొందరు కావాలని మీటూ ఉద్యమాన్ని చెడగొడుతున్నారు అనే కామెంట్స్ వచ్చాయి.

 మలయాళంలో మీటూ..

మలయాళంలో మీటూ..

మలయాళం ఇండస్ట్రీలో గత మూడేళ్లలో ఎంతో మంది హీరోయిన్స్ వారికి ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. ముఖ్యంగా ఒక ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్ కేసు ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కావాలని కిడ్నాప్ చేయించి ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

 మరో దర్శకుడిపై ఆరోపణలు..

మరో దర్శకుడిపై ఆరోపణలు..

మరో దర్శకుడికి సంబంధించిన కొత్త వివాదం మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక నటి విషయంలో అతడు అసభ్యంగా ప్రవర్తించగా కేసు నమోదైనట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సీనియర్ దర్శకుడు కమల్ వర్ధమాన నటిని వేదించినట్లు ఒక న్యూస్ ఛానెల్ లో కథనాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అవకాశం ఇస్తామని చెప్పి దర్శకుడు లైంగికంగా హీరోయిన్ పై దాడి చేసినట్లు చెబుతున్నారు.

సొంత ఇంట్లోనే..

సొంత ఇంట్లోనే..

మలయాళీ దర్శకుడిగానే కాకుండా కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కమల్ 'ఆమి' సినిమాలో నటించిన తనకు ‘ప్రణయమీనుకలుడే కాదల్' సినిమాలో ఒక మాంచి లీడ్ రోల్ ఇస్తానని కమల్ మాట ఇచ్చినట్లు ఆ నటి చెప్పినట్లు వార్తల్లో తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం హీరోయిన్ పాత్ర ఇవ్వకపోగా దర్శకుడు తన సొంత ఇంట్లోనే తనను లైంగికంగా వేధించాడని ఆ నటి ఆరోపించినట్లు పేర్కొన్నారు.

Recommended Video

Shakeela Shocking Comments
క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

తనపై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని దర్శకుడు కమల్ మరొక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. సదరు మీడియా కావాలనే ఇలా తనపై చెడు వార్తలు ప్రసారం చేస్తోంది తనకు ఒక కేసు విషయంలో నోటీసులు వచ్చిన మాట నిజమే అంటూ.. అయితే దానిపై తన అడ్వకేట్‌ను సంప్రదించగా, ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయన చెప్పారని అన్నారు. కావాలని తనపై ఇలా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం వెనుక చలనచిత్ర అకాడమీలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు దీని వెనుక ఉన్నారని కమల్ అనుమానం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X