Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
గర్బం దాల్చిన యువనటి.. బాయ్‌ఫ్రెండ్‌తో 23 ఏళ్ల వయసులోనే..
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రతిభవంతులైన యువ తారల్లో అను సితార ఒకరు. తక్కువ సమయంలోనే టాలెంటెడ్ యాక్టర్‌గా, పాత్రలకు న్యాయం చేసే ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నది. సినిమాల్లో రాణిస్తుండగానే తన బాయ్‌ఫ్రెండ్ విష్ణు ప్రసాద్‌తో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే ఈ మధ్య అను సితార తల్లి కాబోతున్నదనే వార్త మీడియాలో హల్చల్ చేయడంపై ఆమె స్పందించారు. ఆమె ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..
బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి
మలయాళంలో రామంటే ఈడెన్ తోట్టం అనే చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకొన్నది. ఆ చిత్రంలో కెప్టెన్ పాత్రలో ఆమెను మెప్పించారు. అలాగే ఓరు కుప్రసిదా పాయ్యన్, నీయమ్ నిజం, శుభరాత్రి, మాంకమ్ చిత్రాల్లో నటించి విమర్శ ప్రశంసలు అందుకొన్నది. ఇలా కెరీర్ దూసుకెళ్తున్న సమయంలో 2017లో తన బాయ్‌ఫ్రెండ్ విష్ణుతో వివాహం చేసుకొని షాకిచ్చింది.
పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు
సినీ, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొంటూ వెళ్లున్న సమయంలో అను సితార గర్భం దాల్చింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉంది. ఈ వార్త ఆమె కుటుంబంలో కూడా ఆనందం నింపింది. పండంటి బిడ్డను స్వాగతించడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు అనే వార్త మీడియాలో వైరల్ అయింది.
ప్రెగ్నెన్సీపై అను సితార క్లారిటీ
తాను గర్బవతిని అనే వార్త రోజు రోజుకు వైరల్ అవుతుండటంతో అను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తాను గర్బవతిని అంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేరకు తన ఫొటోను, మీడియాలో వస్తున్న వార్తల క్లిప్పింగులను జత చేసి.. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. తనపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని పేర్కొన్నది.
అప్పుడే మేము పిల్లల గురించి
విష్ణు ప్రసాద్‌తో కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. నా వయస్సు 23 సంవత్సరాలే. అప్పుడే పిల్లలు కనే ఆలోచన మాకు లేదు అని అను సితార స్పష్టం చేశారు. ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టిపెట్టాను. కొద్ది రోజుల ఆగి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం అని అన్నారు. మలయాళ చిత్రాల్లో నటిస్తూనే ఇటీవల తమిళంలో పోదు నాలన్ కరుతి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలై మంచి పేరు తీసుకువచ్చింది.