twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్బం దాల్చిన యువనటి.. బాయ్‌ఫ్రెండ్‌తో 23 ఏళ్ల వయసులోనే..

    |

    మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రతిభవంతులైన యువ తారల్లో అను సితార ఒకరు. తక్కువ సమయంలోనే టాలెంటెడ్ యాక్టర్‌గా, పాత్రలకు న్యాయం చేసే ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నది. సినిమాల్లో రాణిస్తుండగానే తన బాయ్‌ఫ్రెండ్‌ విష్ణు ప్రసాద్‌తో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే ఈ మధ్య అను సితార తల్లి కాబోతున్నదనే వార్త మీడియాలో హల్‌చల్ చేయడంపై ఆమె స్పందించారు. ఆమె ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

    బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి

    బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి

    మలయాళంలో రామంటే ఈడెన్ తోట్టం అనే చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకొన్నది. ఆ చిత్రంలో కెప్టెన్ పాత్రలో ఆమెను మెప్పించారు. అలాగే ఓరు కుప్రసిదా పాయ్యన్, నీయమ్ నిజం, శుభరాత్రి, మాంకమ్ చిత్రాల్లో నటించి విమర్శ ప్రశంసలు అందుకొన్నది. ఇలా కెరీర్ దూసుకెళ్తున్న సమయంలో 2017లో తన బాయ్‌ఫ్రెండ్ విష్ణుతో వివాహం చేసుకొని షాకిచ్చింది.

     పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు

    పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు

    సినీ, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొంటూ వెళ్లున్న సమయంలో అను సితార గర్భం దాల్చింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉంది. ఈ వార్త ఆమె కుటుంబంలో కూడా ఆనందం నింపింది. పండంటి బిడ్డను స్వాగతించడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు అనే వార్త మీడియాలో వైరల్ అయింది.

     ప్రెగ్నెన్సీపై అను సితార క్లారిటీ

    ప్రెగ్నెన్సీపై అను సితార క్లారిటీ

    తాను గర్బవతిని అనే వార్త రోజు రోజుకు వైరల్ అవుతుండటంతో అను సితార తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. తాను గర్బవతిని అంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేరకు తన ఫొటోను, మీడియాలో వస్తున్న వార్తల క్లిప్పింగులను జత చేసి.. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. తనపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని పేర్కొన్నది.

     అప్పుడే మేము పిల్లల గురించి

    అప్పుడే మేము పిల్లల గురించి

    విష్ణు ప్రసాద్‌తో కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. నా వయస్సు 23 సంవత్సరాలే. అప్పుడే పిల్లలు కనే ఆలోచన మాకు లేదు అని అను సితార స్పష్టం చేశారు. ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టిపెట్టాను. కొద్ది రోజుల ఆగి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం అని అన్నారు. మలయాళ చిత్రాల్లో నటిస్తూనే ఇటీవల తమిళంలో పోదు నాలన్ కరుతి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలై మంచి పేరు తీసుకువచ్చింది.

    English summary
    Anu Sithara is now one of the busiest Malayalam actresses around. Within a very short span of time, she has etched her name in the list of the most reliable and talented actresses of the film industry. Of late, a whole lot of rumours have been doing the rounds regarding her personal life. Some of the reports that surfaced in the online circuits claimed that, the actress and her husband Visnu Prasad are expecting their first child and she is preparing for motherhood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X