twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కరోనాతో మోహన్‌లాల్ మృతి’ సోషల్ మీడియాలో పైశాచికత్వం.. రంగంలోకి పోలీసులు

    |

    కరోనావైరస్ భయాలు ఓ వైపు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోపక్క ఆకతాయిలు సోషల్ మీడియాలో అల్లరి, చిల్లర పనులకు పాల్పడుతూ సమస్యలు సృష్టిస్తున్నారు. 21 లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో కేరళలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌పై దారుణమైన ప్రచారానికి ఒడిగట్టారు. మోహన్‌లాల్ కరోనావైరస్‌తో మరణించారంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వివాదం గురించి మోహన్‌లాల్ ఇచ్చిన వివరణ ఇదే..

    Recommended Video

    Pranks on Mohanlal on April Fool's day Goes Viral
    మోహన్‌లాల్ మరణించారంటూ..

    మోహన్‌లాల్ మరణించారంటూ..

    కరోనావైరస్ కారణంగా సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరణించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయింది. ఏప్రిల్ ఫూల్ అంటూ తర్వాత ప్రత్యర్థి హీరోల ఫ్యాన్స్ సందడి చేశారు. అయితే ఇలాంటి ఎమోషల్ అంశాలను అల్లరి చేస్తూ, అకృత్యాలకు పాల్పడటంపై కేరళ పోలీసుల తీవ్రంగా స్పందించారు.

    బోగస్ వార్తలు.. నమ్మకండి..

    బోగస్ వార్తలు.. నమ్మకండి..

    మోహన్‌లాల్ మరణంపై బోగస్ వార్తలు విజృంభిస్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి ఫ్యాన్స్ రంగంలొకి దిగారు. రాష్ట్ర మోహన్‌లాల్ ఫ్యాన్స్, కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విమల్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. మోహన్ లాల్‌పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. అందులో నిజం లేదు అంటూ పోస్టులు పెట్టారు.

     ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ ఫిర్యాదు

    ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ ఫిర్యాదు

    మోహన్‌లాల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేరళ పోలీసుల దృష్టికి ఫ్యాన్స్ అధ్యక్షుడు విమల్ కుమార్ తీసుకొచ్చారు. ఈ దారుణానికి కారణమైన పోకిరిపై పోలీసులకు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేశారు. మోహన్‌లాల్ సినిమాలోని ఓ పాత సీన్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

     రంగంలోకి పోలీసులు

    రంగంలోకి పోలీసులు

    మోహన్‌లాల్ ఫ్యాన్స్ అధ్యక్షుడు విమల్ కుమార్ చేసిన ఫిర్యాదుపై కేరళ పోలీసులు స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులను గుర్తిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలతో భయాందోళనలకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని గుర్తించి తగిన శిక్షను తీసుకుంటామని హామీ ఇచ్చారు.

    English summary
    Rumours on Mohanlal death goes viral on April 1st. April Fool's day pranks on Mohan Lal death went awkward situation. On complaint from Fans, Kerala Police into scene to control damage to the hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X