మలయాళంలో అర్జున్ రెడ్డి.. హీరో ఎవరంటే!
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం యువతని ఉర్రూతలూగించింది. జాతీయ వ్యాప్తంగా ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం హిందీ, తమిళ నిర్మాతలు ఎగబడ్డారు.
తమిళ రీమేక్ లో విక్రమ్ కుమారుడు ధృవ్ నటిస్తున్నాడు. వర్మ పేరుతో తమిళంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీ రీమేక్ కు తెలుగు వర్షన్ దర్శకుడు సందీప్ వంగానే దర్శకత్వం వహించబోతున్నాడు. హిందీ అర్జున్ రెడ్డిగా స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మాలయంలో కూడా ఈ చిత్రం రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అనే విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇక మలయాళీ అర్జున్ రెడ్డిగా ఎవరు నటిస్తారు అనే అంశం గురించి అభిమానులు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రేమమ్ చిత్రంతో సంచలనం సృష్టించిన నవీన్ పౌలి ఏ చిత్రంలో నటించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











