అత్యంత విషమంగా యువ హీరోయిన్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయండి అంటూ !
తమిళ, మలయాళం ప్రేక్షకులను అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న యువ హీరోయిన్ అరుంధతి నాయర్ మృత్యువుతో పోరాటం చేస్తున్నది. మూడు రోజుల క్రితం యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ప్రాణాలతో పోరాడుతున్నది. అయితే అరుంధతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించిన హెల్త్ బులెటిన్ వివరాల్లోకి వెళితే..
తన సోదరుడితో కలిసి వాహనంపై వస్తుండగా అరుంధతి నాయర్ కోవలం బీచ్ వద్ద ఉన్న బైపాస్ వద్ద ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స జరిపించారు. అనంతరం త్రివేండ్రంకు సమీపంలోని అనంతపురి హాస్పిటల్‌లో చేర్పించాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే గత మూడు రోజులుగా మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు అందిస్తున్నారు. అయితే ఆమె ఆర్యోగ పరిస్థితి కొంచెం మెరుగుపడినప్పటికీ.. ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు దాటితే గానీ ఆమె హెల్త్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేం. ఇంకా వెంటిలేటర్‌పైన ఉంచి చికిత్సను అందిస్తున్నాం అని వైద్యులు తెలిపారు.
అయితే అరుంధతి నాయర్ ఆరోగ్య పరిస్తితిపై వస్తున్న వార్తలు, రూమర్లను కుటుంబ సభ్యులు ఖండించారు. నా సోదరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఆమె గురించి ఎలాంటి అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రచారం చేయవద్దు. ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి వార్త ఉన్న మేము అధికారికంగా వెల్లడిస్తాం. లేదా వైద్యులు తెలిపే హెల్త్ బులెటిన్‌ను మీడియాకు అందిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, అరుంధతి నాయర్ వైద్యానికి అవసరమైన డబ్బు కోసం ఎవరైనా స్పందించి ఆర్థిక సహాయం అందించాలని ఆమె స్నేహితుడు గోపిక అనిల్ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నది. వెంటిలేటర్‌పై ఉండి మృత్యువుతో యుద్ధం చేస్తున్నది. వైద్యానికి ఖర్చులు భరించలేని స్థితికి చేరుకొన్నాయి. కాబట్టి మీకు వీలైనంత, చాతనైనంత సాయం చేయండి అంటూ అభ్యర్థించారు.
మీరు చేసే సహాయం అరుంధతి నాయర్ కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. కాబట్టి మీరు అన్యదా భావించకుండా ఆర్థిక సహాయం చేయండి. ఆమె వైద్యానికి సహాయం చేయాలనుకొనే వారు నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు డిపాజిట్ చేయవచ్చు అని వివరాలు అందించారు.


Click it and Unblock the Notifications











