మృత్యువుతో పోరాడుతున్న యువ హీరోయిన్.. రోడ్డు ప్రమాదంపై రూమర్లను ఖండించిన సోదరి
తమిళ, మలయాళ సినిమా రంగాల్లో రాణిస్తున్న వర్థమాన తార అరుంధతి నాయర్ మృత్యువుతో పోరాటం చేస్తున్నది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. మార్చి 14వ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. అరుంధతి నాయర్ యాక్సిడెంట్‌పై వస్తున్న వార్తలపై సోదరి సోషల్ మీడియాలో స్పందించిన వివరాల్లోకి వెళితే..
నా సోదరి యాక్సిడెంట్ గురించి తమిళ, మలయాళ మీడియాలో వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని భావించాం. నా సోదరి మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దాంతో త్రివేండ్రంకు సమీపంలోని అనంతపురి హస్పిటల్‌లో ఆమెను చేర్పించాం. ఆమె ప్రాణాలతో పోరాటం చేస్తున్నది అని తెలిపింది.

నా సోదరి ప్రయాణిస్తున్న వాహనం కోవలం బైపాస్‌లో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నా సోదరుడితో కలిసి ప్రయాణిస్తున్నది. యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని తెలిపారు.
తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరిన అరుంధతి నాయర్‌కు వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పైన ఉంచి వైద్యం అందిస్తున్నారు. దాంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

అరుంధతి నాయర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె తమిళ సినిమారంగంలోకి 2014 సంవత్సరంలో పొంగి ఎజు మనోహర సినిమాతో అడుగుపెట్టారు. ఆ తర్వాత సైతాన్, పిస్తా సినిమాల్లో నటించారు. 2018లో మలయాళ రంగంలోకి అడుగపెట్టి ఒట్టకోరు కాముకాన్ అనే సినిమాలో నటించారు. ఆయిరామ్ పొర్కాసుకై చిత్రంలో నటించారు. తమిళ, మలయాళ రంగంలో పలు సినిమాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











