భర్త తప్పి పోయాడా? హీరోయిన్ పిచ్చి వేషాలతో... భగ్గుమన్న జనం!
మలయాళ నటి ఆశా శరత్ కొన్ని రోజుల క్రితం తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన భర్త కనిపించకుండా పోయాడని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, ఎవరికైనా కనిపిస్తా సమాచారం అందించండి అంటూ ఆమె ఆ వీడియోలో ప్రజలను రిక్వెస్ట్ చేశారు.
తన భర్త గురించిన ఆచూకీ దొరికితే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె ఆ వీడియోలో కోరారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ కావడంతో లక్షల మంది వీక్షించారు. పలువురు అభిమానులు రియాక్ట్ అవుతూ మీ భర్త కనిపిస్తే తప్పకుండా సమాచారం అందిస్తామంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు.

ఆమె చెప్పినవన్నీ అన్నీ అబద్దాలే...
నిజం అనేది ఎన్నో రోజులు దాగదు. ఆశా శరత్ తన భర్త మిస్సయ్యాడు అంటూ షేర్ చేసిన వీడియోలో ఆమె చెప్పిన విషయాలన్నీ అబద్దాలే అని తేలిపోయింది. తన సినిమా ‘ఎవిడే' సినిమా ప్రమోషన్ కోసమే ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆశా శరత్ తప్పిపోయిన తన భర్త కోసం వెతికే మిడిల్ ఏజ్ ఉమెన్ పాత్రలో నటిస్తోంది.

ఆశా శరత్ మీద ఫైర్ అవుతున్న జనం
అసలు విషయం తెలిసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. సినిమా ప్రమోషన్ కోసం జనాలను ఫూల్స్ చేయడం ఏం బాగోలేదని, ఇలాంటి వేషాలు వేస్తే... రేపు నిజంగా నీ మొగుడు మిస్సయినా ఎవరూ నమ్మరు. ఇలాంటి చేష్టలతో ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీతడియా మాధ్య మాలను మిస్ యూజ్ చేయవద్దు అని సూచిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్
ఆశా శరత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోపై కేరళలో ఓ లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆశా శరత్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తోందని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ సినిమాను బహిష్కరించండి
‘ఎవిడే' మూవీకి ప్రచారం కల్పించడానికి ఆశా శరత్ చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ సినిమాను బాయ్ కాట్ చేయడం ద్వారా ఆమెకు తగిన బుద్ది చెప్పాలని, సినిమా వాళ్లు ఎవరూ ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా గుణపాఠం నేర్పాలంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











