బ్రేకింగ్: ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. శోక సంద్రంలో సినీలోకం
ప్రముఖ మలయాళ దర్శకుడు సాచీ ఇకలేరు. అయ్యప్పనమ్ కోషియమ్ లాంటి రికార్డు హిట్‌ను మలయాళ చిత్ర పరిశ్రమకు అందించిన సాచీ త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో ఆయనను హస్పిటల్‌కు తరలించి వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన గురువారం రాత్రి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. పలువురు సీని ప్రముఖులు షాక్ గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. సాచి మృతి గురించి మరిన్నీ వివరాలు..

తుంటి మార్పిడి సర్జరీ తర్వాత
దర్శకుడు సాచీ కొద్ది రోజుల క్రితం త్రిచూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుంటి మార్పిడి సర్జరీ చేయించుకొన్నారు. ఈ సర్జరీ తర్వాత ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రమయ్యాయి. దాంతో కొన్ని రోజులుగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో మంగళవారం (జూన్ 16) గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్‌కు తరలించారు.

జూబ్లీ మిషన్ హాస్పిటల్‌లో చికిత్స
త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్ చేర్పించే సమయానికే సాచీ పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించారు. ఆయనన ప్రాణాలు కాపాడటానికి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. దాదాపు 48 గంటలపాటు ఆయన ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షించారు. అయితే ఆయన చికిత్సకు స్పందించకపోవడం వల్ల గురువారం తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.

కోవిడ్-19 పరిస్థితుల కారణంగా
కోవిడ్-19 పరిస్థితుల కారణంగా సాచీ ఇన్‌ఫెక్షన్ సోకుతుందనే కారణంతో కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఎవరిని అనుమతించకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించాలనే ఆలోచనను పలువురు ప్రముఖులు వాయిదా వేసుకొవడం జరిగింది. అయినా కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లోనే దూరంగా ఉండి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.

దర్శకుడు సాచీ కెరీర్ విషయానికి వస్తే
సాచీ అనార్కలి సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తన రెండో సినిమాగా అయ్యప్పనుమ్ కోషియమ్ అనే చిత్రాన్ని బిజూ మీనన్, ఫృథ్వీరాజ్‌తో కలిసి తెరక్కించారు. రూ.5 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది.

అయ్యప్పనుమ్ కోషియం హిందీ, తమిళంలో రీమేక్
ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం చిత్రం తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని హిందీలో ప్రముఖ హీరో, నిర్మాత జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా హక్కులను నిర్మాతలు కదిరేషన్, శశికుమార్ తీసుకొన్నారు. తమిళంలో కూడా బీజూ మీనన్‌ను తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ ప్రకటన వెలువడనున్నది.


Click it and Unblock the Notifications











