ప్రముఖ దర్శకుడికి గుండెపోటు.. పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
ప్రముఖ మలయాళ దర్శకుడు సాచీ పరిస్థితి విషమంగా మారడంతో హస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మలయాళంలో అయ్యప్పనమ్ కోషియమ్ అనే చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించడానికి కారణం ఏమిటంటే..

వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ..
అయ్పప్పనుమ్ కోషియం దర్శకుడు సాచీ మంగళవారం (జూన్ 16) గుండెపోటుకు గురయ్యాడు. దాంతో వెంటనే ఆయనను త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం అతడిని వెంటిలేటర్‌పై ఉంచినట్టు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురై
దర్శకుడు సాచీకి కొద్ది రోజుల క్రితం త్రిచూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుంటి మార్పిడి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. కొన్ని రోజులుగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు.ఆ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడం జరిగింది. ప్రస్తుతం 24 గంటలు దాటితే గానీ ఆయన ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేం అని వైద్యులు మీడియాకు వెల్లడించారు.

కోవిడ్-19 పరిస్థితుల కారణంగా
కోవిడ్-19 పరిస్థితుల కారణంగా సాచీ వద్దకు కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఎవరిని అనుమతించడం లేదు. ఈ క్రమంలో ఆయనను పరామర్శించాలనే ఆలోచనను పలువురు ప్రముఖులు వాయిదా వేసుకొన్నారు. కుటుంబ సభ్యులను హాస్పిటల్‌లో ఉంటున్నారు. కానీ ఆయనకు దూరంగా ఉండి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నట్టు సమాచారం.

5 కోట్ల బడ్జెట్ 50 కోట్ల వసూళ్లు
దర్శకుడు సాచీ కెరీర్ విషయానికి వస్తే అనార్కలి సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తన రెండో సినిమాగా అయ్యప్పనుమ్ కోషియమ్ అనే చిత్రాన్ని బిజూ మీనన్, ఫృథ్వీరాజ్‌తో కలిసి తెరక్కించారు. రూ.5 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది.

హిందీ, తమిళంలో రీమేక్
ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం చిత్రం తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని హిందీలో ప్రముఖ హీరో, నిర్మాత జాన్ అబ్రహం నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా హక్కులను నిర్మాతలు కదిరేషన్, శశికుమార్ తీసుకొన్నారు. తమిళంలో కూడా బీజూ మీనన్‌ను తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ ప్రకటన వెలువడనున్నది.


Click it and Unblock the Notifications











