twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ప్రముఖ నటుడు.. విషాదంలో సినీ పరిశ్రమ

    |

    దక్షిణాదిలో తన ప్రతిభతో రాణిస్తున్న నటుడు అనిల్ నెడుమంగాడ్ ఇకలేరు. శుక్రవారం ఆకస్మాత్తుగా మరణించడం అభిమానులను విషాదానికి గురిచేసింది. అయ్యప్పనుమ్ కోషియమ్, కమాటీ పాదం, నాన్ స్టీవ్ లోపేజ్, పొరింజు మారియమ్ జోస్చిత్రాల్లో నటించి మెప్పించారు. అనిల్ మరణానికి కారణం ఏమిటంటే..

    కేరళలోని మలంకరా డ్యామ్‌లో

    కేరళలోని మలంకరా డ్యామ్‌లో

    దక్షిణాది మీడియా తెలిపిన ప్రకారం.. అనిల్ నుడుమంగాడ్ కేరళలోని మలంకరా డ్యామ్‌లో స్నానం కోసం వెళ్లి మృత్యువాత పడ్డారు అని పేర్కొన్నారు. జోజు జార్జ్ నటిస్తున్న పీస్ చిత్రం షూటింగ్ థోడుపుంజా‌లో జరుగుతున్నది. షూటింగుకు కాస్త యూనిట్ విరామం ఇవ్వడంతో అనిల్ తన స్నేహితులతో కలిసి డ్యామ్‌లో ఈత కోసం వెళ్లారు.

    అలల ముంచెత్తడంతో మునక

    అలల ముంచెత్తడంతో మునక

    డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. డ్యామ్‌లో లోతైన ప్రదేశానికి వెళ్లాడు. ఆ సమయంలో భారీగా అలలు రావడంతో అందులో మునిగిపోయాడు. స్తానిక సిబ్బంది, ఈతగాళ్లు ఆయనను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు.

    విషాదంలో పృథ్వీరాజ్ సుకుమారన్

    విషాదంలో పృథ్వీరాజ్ సుకుమారన్

    అనిల్ నెడుమంగాడ్ మరణ వార్తను నటుడు, నిర్మాత, డైరెక్టర్, గాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఫేస్ బుక్ ద్వారా ధృవీకరించారు. అనిల్ గురించిన విషాద వార్తను చెప్పడానికి ఇష్టం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ తన సంతాప సందేశాన్ని రాశారు.

    అనిల్ నుడుమంగాడ్ కెరీర్ విషయానికి వస్తే..

    అనిల్ నుడుమంగాడ్ కెరీర్ విషయానికి వస్తే..

    అనిల్ రవి కెరీర్ విషయానికి వస్తే.. థస్కరవీరన్ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆతర్వాత 2014లో రాజీవ్ రవి రూపొందించిన నాన్ స్టీవ్ లోపేజ్ చిత్రంలో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకొన్నారు. 2020లో అనిల్ చివరిసారిగా పాపమ్ చెయ్యథవార్కల్లెరియట్టే అనే చిత్రంలో నటించారు.

    English summary
    Ayyappanum Koshiyum actor drowns in Malankara Dam. He drowns in Malankara Dam. Nothing. I have nothing to say. Prithviraj Sukumaran condolenced that ope you’re at peace Anil etta
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X