ఓటిటి లో ఉన్న 7 ఆల్ టైం బెస్ట్ మూవీస్ ఇవే
ఈ ఏడాది ప్రేమలు , భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాలతో మలయాళ బాక్స్ ఆఫీసు షేక్ అయ్యింది. 2024ను మలయాళ ఇండస్ట్రీకి గోల్డెన్ టైమ్ గా చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో ఉన్న టాప్ 5 మాలీవుడ్ బెస్ట్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
మంజుమ్మెల్ బాయ్స్
చిదంబరం దర్శకత్వం వహించిన రెండవ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమలో అతి పెద్ద బ్లాక్ బస్టర్, ఆల్-టైమ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. కొడైకెనాల్‌లోని గుణ గుహలో చిక్కుకున్న మంజుమ్మెల్ అనే చిన్న పట్టణానికి చెందిన యువకుల బృందం తమ స్నేహితుడిని ఎలా కాపాడారు అనేదే స్టోరీ. మంజుమ్మెల్ బాయ్స్ అనేది మలయాళ మూవీ లవర్స్ తప్పక చూడవలసిన సినిమా. హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

భ్రమయుగం
రాహుల్ సదాశివన్ రూపొందించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ భ్రమయుగం. కేరళ మధ్యయుగ పురాణాలు, జానపద కథల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మూవీ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఫీలింగ్ ను ఇచ్చింది. సోనీ లివ్ లో ఉంది ఈ మూవీ.

జోజి,
దిలీష్ పోతన్ దర్శకత్వం వహించిన మూవీ జోజి. ఇది మలయాళ చిత్రసీమలో ఇప్పటి వరకు వచ్చిన క్లాసిక్ చిత్రాలలో ఒకటి. ఈ సైకలాజికల్ క్రైమ్ డ్రామా చిత్రంలో ఫహద్ ఫాసిల్ టైటిల్ రోల్ పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న జోజీ, ముఖ్యంగా ప్రధాన పాత్రలో ఫహద్ ఫాసిల్ అసాధారణమైన నటన కారణంగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఉంది ఈ మూవీ.
దృశ్యం
జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం 2013లో విడుదలైనప్పుడు మలయాళ చిత్రసీమలో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అద్భుతమైన కథనంతో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీతో సహా వివిధ భాషలలో రీమేక్ అయ్యి, అక్కడ కూడా హిట్ గా నిలిచింది. మలయాళంలో వచ్చిన టాప్ సినిమాల్లో ఒకటిగా దృశ్యం ప్రశంసలు అందుకుంది. మోహన్‌లాల్ , మీనా, షాజోన్‌ల అద్భుతమైన నటన మలయాళ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డ్ బద్దలు కొట్టే విజయానికి దోహదపడ్డాయి. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రేమలు
మలయాళ చిత్రసీమలో చాలా కాలం తర్వాత వచ్చిన బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ప్రేమలు ఒకటి. ఈ రొమాంటిక్ కామెడీ-డ్రామా ఆధునిక ప్రేమ. కొత్త తరం మధ్య సంబంధాలను ఫన్నీగా చూపించారు. నస్లెన్ గఫూర్, మమితా బైజు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. లైట్‌హార్టెడ్ డ్రామాలను రూపొందించడంలో పేరుగాంచిన గిరీష్ ఏడీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, రీసెంట్ గా రిలీజై అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది ఈ మూవీ. హాట్ స్టార్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications











