తల్లి కాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఏడాదిపాటు డేటింగ్.. ఆ తర్వాత..!

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న యాక్టర్, హోస్ట్ పర్ల్ మానీ తల్లి కాబోతున్నారు. త్వరలోనే తాను పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మలయాళ బిగ్‌బాస్‌ రన్నరప్‌గా నిలిచిన పర్ల్ మానీ వివాహం తన తోటీ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సెలబ్రిటీ దంపతులు మరో బిడ్డకు జన్మినివ్వబోతున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. పర్ల్ మానీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఏం చెప్పారంటే..

Recommended Video

Bigg Boss Malayalam Contestants Prepared To Get Married
 బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో డేటింగ్

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో డేటింగ్

యాక్టర్, హోస్ట్ పర్ల్ మానీ ప్రేమాయణం బిగ్‌బాస్ ఇంటిలోనే మొదలైంది. తన తోటి కంటెస్టెంట్ శ్రీనిష్ అరవింద్‌తో ప్రేమలో పడిన ఈ భామ ఏడాది పాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత 2019లో వారిద్దరు పెళ్లి చేసుకొన్నారు. ఏడాది తిరగకముందే వారిద్దరూ అభిమానులకు శుభవార్తను అందించారు.

రెండేళ్లక్రితం ప్రేమ.. ఏడాది తర్వాత పెళ్లి

రెండేళ్లక్రితం ప్రేమ.. ఏడాది తర్వాత పెళ్లి

తాజాగా తాను గర్బవతిని అంటూ పర్ల్ మానీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో తాను కొద్దినెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం మేమిద్దరం ప్రపోజ్ చేసుకొన్నాం. ఈ రోజు నాలో ఓ అద్భుతమైన దివ్యరూపం పెరుగుతున్నది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నీ దీవెనలు, ప్రార్థనలు కావాలి అంటూ ట్వీట్ చేశారు.

 ప్రెగ్నెన్సీతో చాలా కష్టాలు..

ప్రెగ్నెన్సీతో చాలా కష్టాలు..

పర్ల్ మానీ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం నాకు మూడు నెలల గర్బం. ఊహించని పరిణామం కొంత కష్టంగానే ఉంది. మార్నింగ్ సిక్‌నెస్‌ చాలా ఇబ్బందిగా మారింది. ప్రతీ రోజు వాంతులతో చాలా కష్టంగా ఉంది. మార్చిలో డెలివరీ డేట్ ఉంది. తండ్రి కాబోతున్న వార్తతో శ్రీనిష్ చాలా హ్యాపీగా ఉన్నారు అని అన్నారు.

కోవిడ్ 19 పరిస్థితులతో అందరికీ దూరంగా

కోవిడ్ 19 పరిస్థితులతో అందరికీ దూరంగా

గర్బవతిని అని వైద్యులు ధృవీకరించిన తర్వాత షూటింగులు మానేశాను. ఇంట్లో ఉండి.. కాస్త ఊరటగా ఉన్నప్పుడు ఇలా వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. కోవిడ్ 19 పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాను. ఎక్కువ మందిని కలువడం లేదు. ఇంటిలోనే క్వారంటైన్‌లో ఉంటున్నాను. ప్రస్తుతం పరిస్థితుల్లో కడుపులో బిడ్డకు ఏమీ కాకుడదని నేను అందరికీ దూరంగా ఉంటున్నాను అని పర్ల్ మానీ తెలిపారు.

 పర్ల్ మానీ కెరీర్ ఇలా..

పర్ల్ మానీ కెరీర్ ఇలా..

తాను గర్బం దాల్చిన విషయాన్ని పంచుకొనేందుకు విడుదల చేసిన సెల్పీ వీడియో వైరల్‌గా మారింది. పర్లి మానికి అభిమానులు విషెస్ అందజేస్తున్నారు. పర్ల్, శ్రీనిష్ దంపతులు మార్చి 2021లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇక పర్ల్ మానీ కెరీర్ విషయానికి వస్తే. నీలాకాశం పంచకడల్ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. కల్యాణ వైభోగం, టీమ్ 5, కప్పిరి తురుతు చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం లూడో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X