Bigg Boss ఇంట్లో కరోనా విజృంభణ.. ఆరుగురికి పాజిటివ్.. షో నిరవధికంగా వాయిదా!
బిగ్‌బాస్ మలయాళం రియాలిటీ షోకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సూపర్‌స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 3వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. బిగ్‌బాస్ మలయాళం ఇంటిలో కరోనా విజృంభించడంతో నిర్వాహకులు నిలిపివేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈ షోను ఎందుకు నిలిపివేశారనే విషయంలోకి వెళితే..
Recommended Video
ప్రియమణి బోల్డ్ అండ్ బ్యూటీపుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

చెన్నై శివారులో బిగ్‌బాస్ ఇంటి సెట్
తమిళనాడులో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. ప్రస్తుతం బిగ్‌బాస్ మలయాళం సీజన్ 4 ఇంటి సెట్‌ను చెన్నై పరిసర ప్రాంతంలోని ఈవీపీ గార్డెన్‌లో వేశారు. తాజాగా షో అక్కడి నుంచి ప్రసారం అవుతున్నది. అయితే బిగ్‌బాస్ ఇంటిలో కరోనా కలకలం రేపడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది.

ఆరుగురు కంటెస్టెంట్లకు కరోనావైరస్?
మలయాళం బిగ్‌బాస్ ఇంటిలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు కరోనా బారిన పడినట్టు సమాచారం. కరోనా లక్షణాలతో బాధపడుతున్న కంటెస్టెంట్లకు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించగా మొత్తం ఆరుగురికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలినట్టు సమాచారం. ఆ ఆరుగురిని ఇంటి నుంచి హాస్పిటల్ చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది.

కరోనా ఉధృతితో నిలిపివేత
బిగ్‌బాస్ ఇంటిలో సగానికిపైగా కరోనావైరస్‌కు గురికావడంతో షోను కొన్ని వారాలపాటు నిలిపివేయాలని ఎండెమాల్ షైన్ నిర్వాహకుల నిర్ణయించినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా కరోనావైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ షోను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. జనవరి 5వ తేదీన ప్రారంభమైన ఈ షో 75 రోజులపాటు నడించింది.

బిగ్‌బాస్ రెండో సీజన్ కూడా అదే పరిస్థితి
గతేడాది బిగ్‌బాస్ మలయాళం సీజన్ 2కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కరోనావైరస్ వెంటాడుతుంటడంతో షోను మధ్యలోనే నిలిపివేస్తూ ఎండోమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ షో కోసం పనిచేసే ఉద్యోగులు, పార్ట్‌నర్స్, సిబ్బంది, కంటెస్టెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కన్నడ బిగ్‌బాస్ అర్ధాంతరంగా నిలిపివేత
ఇదిలా ఉండగా, కన్నడ బిగ్‌బాస్ షోపై కరోనావైరస్ దెబ్బ పడింది. కర్ణాటకలో కరోనావైరస్ విజృంభించిన నేపథ్యం, అలాగే లాక్ డౌన్ విధించడంతో ఈ షోను 71వ రోజున నిలిపివేస్లూ ఎండెమాల్ షైన్ నిర్ణయం తీసుకొన్నది. ఈ షోకు కిచ్చ సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











