Bigg Bossకు మళ్లీ ఎదురుదెబ్బ.. ఇంటికి తాళం.. 8 మందికి కరోనా.. నిర్వాహకులపై కేసు!

సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరించే మలయాళం బిగ్‌బాస్ 3 సీజన్‌‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. కొద్ది వారాలుగా సజావుగా సాగుతున్న ఈ షోకు కరోనావైరస్ అడ్డుపడింది. కంటెస్టెంట్లకు పాజిటివ్ రావడంతో గందరగోళం నెలకొన్నది. నిబంధనలు పాటించలేదని తమిళనాడు అధికారులు బిగ్‌బాస్‌ హౌస్‌కు సీల్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివారాల్లోకి వెళితే...

హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆ చబ్బీ అందాలు డోస్ తగ్గలేదు

 బిగ్‌బాస్ మలయాళం 2 మధ్యలోనే...

బిగ్‌బాస్ మలయాళం 2 మధ్యలోనే...

గతేడాది బిగ్‌బాస్ మలయాళం 3 సీజన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సాంకేతిక నిపుణులు, కంటెస్టెంట్లు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షోను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్లందరికి విజేతలుగా ప్రకటించి ట్రోఫీలను బహుకరించారు.

ఫిబ్రవరి 14వ తేదీన

ఫిబ్రవరి 14వ తేదీన

ఇక బిగ్‌బాస్ మూడో సీజన్ ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజున మొదలైంది. 14 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో 95వ రోజుకు చేరకొన్నది. బుధవారం వరకు 7గురు కంటెస్టెంట్లు మిగిలారు. అయితే కరోనావైరస్ నిబంధనలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ ప్రోటోకాల్స్ పాటించకుండా షోను నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులపై తమిళనాడు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కేసు బుక్ చేసింది.

8 మంది వర్కర్లకు కరోనా

8 మంది వర్కర్లకు కరోనా

తమిళనాడులో కరోనావైరస్ లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత మరో రెండు వారాలు షోను పొడిగిస్తూ నిర్ణయం తీసుకొన్నది. అలాగే హోస్ట్ మోహన్‌లాల్ స్వయంగా ఈ షోను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఇంటిలో పనిచేసే 8 మంది వర్కర్లకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

ప్రొటోకాల్స్, నిబంధనలకు వ్యతిరేకంగా

ప్రొటోకాల్స్, నిబంధనలకు వ్యతిరేకంగా

దీంతో చెన్నైలోని తిరువల్లూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ప్రీతి పర్కావీ మాట్లాడుతూ.. కంటెస్టెంట్లందరినీ, కెమెరామెన్లను, టెక్నిషియన్లను, ఇతర స్టాఫ్‌ను ఖాళీ చేయించాం. బిగ్‌బాస్ ఇంటిని సీల్ చేశాం. షూటింగులపై నిషేదం కొనసాగుతున్న సమయంలో కూడా వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దాంతో నిర్వాహకులపై కేసు నమోదు చేశాం అని తెలిపారు.

Recommended Video

Bigg Boss Malayalam 3 News | Filmibeat Telugu
హోటల్‌కు కంటెస్టెంట్లు...

హోటల్‌కు కంటెస్టెంట్లు...

చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీ‌లో బిగ్‌బాస్ సెట్ వేసి షోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కంటెస్టెంట్లను ఖాళీ చేయించి ఓ స్టార్ హోటల్‌కు తరలించినట్టు సమాచారం. అయితే ఈ షోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. కరోనావైరస్ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్లీ షోను కొనసాగిస్తాం అని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X