బిగ్‌బాస్ సెలబ్రిటీ కంట్లో పచ్చి కారం కొట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ఘనుడు

బిగ్‌బాస్ మలయాళ రియాలిటీ షోలో ఓ టాస్క్ సందర్భంగా తోటి కంటెస్టెంట్ కళ్లలో పచ్చి కారం ముద్ద పెట్టడం దేశ వినోదరంగంలో చర్చనీయాంశమైంది. అలాంటి చర్యకు పాల్పడిన డాక్టర్ రంజిత్ కుమార్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేసుకొన్న రంజిత్‌కు మలయాళ దర్శకుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకు రంజిత్ కుమార్‌కు దక్కిన ఆఫర్ ఏమిటంటే..

 సెలబ్రిటీ కంట్లో కొట్టడంతో

సెలబ్రిటీ కంట్లో కొట్టడంతో

మలయాళ బిగ్‌బాస్‌ సీజన్ 2లో 62వ ఎపిసోడ్ సందర్భంగా జరిగిన టీచర్, స్టూడెంట్ టాస్క్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకొన్నది. డాక్టర్ రంజిత్ కుమార్ తోటి కంటెస్టెంట్ రేష్మ కళ్లలో పచ్చి కారం ముద్దు పెట్డడంతో ఆమె హస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కార్నియా సంబంధిత ట్రీట్‌మెంట్ తీసుకొని హౌస్‌లోకి వచ్చారు.

రంజిత్ కుమార్ ఎలిమినేషన్

రంజిత్ కుమార్ ఎలిమినేషన్

ఇలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడిన రంజిత్ కుమార్‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి తాత్కాలికంగా ఎలిమినేట్ చేశారు. అంతేకాకుండా మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడినందుకు గాను ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. డాక్టర్ అలెప్పీ అష్రాఫ్ అనే సామాజిక కార్యకర్త మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

 అరెస్ట్ వార్తల నేపథ్యంలో సినిమా ఆఫర్

అరెస్ట్ వార్తల నేపథ్యంలో సినిమా ఆఫర్

ఇలా ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావొచ్చనే వార్తల మధ్య రంజిత్ కుమార్‌కు పెక్సన్ అంబ్రోస్ అనే డైరెక్టర్ తాను రూపొందించబోయే క్రేజీ టాస్క్ అనే సినిమాలో హీరోగా నటించమని ఆఫర్ ఇచ్చారు. రంజిత్‌పై హక్కుల కమీషన్‌లో ఫిర్యాదు చేసిన అలెప్పీ స్వయంగా ఈ సినిమాకు కథ, మాటలు రాయడం గమనార్హం.

సైక్రియాటిస్ట్ పాత్రలో

సైక్రియాటిస్ట్ పాత్రలో

కొత్త తారలతో రూపొందించే క్రేజీ టాస్క్ సినిమాలో రంజిత్ కుమార్ సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే కథలో రంజిత్ కుమార్‌ది కీలకపాత్ర అని అష్రాఫ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రంజిత్ కుమార్‌తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X