రెమ్యునరేషన్ బయటపెట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. పప్పులో కాలేసి.. భోరున విలపించిన సెలబ్రిటీ!

కరోనావైరస్ ఓవైపు బయట విజృంభిస్తుంటే.. మలయాళ బిగ్‌బాస్ షో రంజుగా సాగుతున్నది. అనేక రకాల వివాదాలతో కంటెస్టెంట్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా డింపుల్ భాల్, కిడిలమ్ ఫిరోజ్ మధ్య చోటుచేసుకొన్న వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి కారణమై ఫిరోజ్‌ను హోస్ట్ మోహన్‌లాల్ గట్టిగానే మందలించారు. అసలు ఈ వివాదంలో ఫిరోజ్‌కు తగిలిన ఎదురు దెబ్బలు ఏమిటంటే..

బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

 అంగవైకల్యంతో ఎమోషనల్‌గా

అంగవైకల్యంతో ఎమోషనల్‌గా

కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా డింపుల్ భాల్‌ను తొటి కంటెస్టెంట్ ఫిరోజ్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆమెను అంగవైకల్యంతో బాధపడే స్పెషల్ చైల్డ్ అంటూ కామెంట్ చేశారు. తన వైకల్యాన్ని సాకుగా చూపి ఎమెషనల్‌గా అందరి అటెన్షన్‌ పొందాలని ట్రై చేస్తున్నారు. నిర్వాహకులు కూడా ఆమెకు తేలిక పాటి టాస్కులు ఇస్తున్నారు అంటూ ఫిరోజ్ లైవ్‌లో ఆరోపణలు చేశారు.

హద్దు మీరి ప్రవర్తిస్తున్నావని మోహన్ లాల్

హద్దు మీరి ప్రవర్తిస్తున్నావని మోహన్ లాల్

కంటెస్టెంట్ ఫిరోజ్ వ్యవహారంపై హోస్ట్ మోహన్ లాల్ మండిపడ్డారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని మందలించారు. ఒకవేళ డింపుల్ అతడిని బయటకు పంపించాలనుకొంటే ఫిరోజ్‌ను పంపించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు అని మోహన్ లాల్ అంటే.. లేదు.. అతడిని కొనసాగనివ్వండి. నేను అతడిని క్షమిస్తున్నాను. నాకు మనశాంతి ముఖ్యం అంటూ ఆమె కామెంట్ చేశారు.

మోహన్‌లాల్‌తో మాట్లాడుతూ కంటతడి

మోహన్‌లాల్‌తో మాట్లాడుతూ కంటతడి

ఇంతలో మరో కంటెస్టెంట్ ఒక్కసారిగా మణికుట్టన్ భావోద్వేగానికి గురయ్యాడు. హోస్ట్ మోహన్‌లాల్‌తో మాట్లాడుతూ కంటతడి పెట్టుకొన్నాడు. ఇంటిలోని పరిస్థితులను చూసి నేను దిగ్బ్రాంతికి గురవుతున్నాను అని భోరున విలపించాడు. అలా ఏడుస్తూ నిబంధనలకు విరుద్ధంగా తన రెమ్యునరేషన్‌ బయటపెట్టడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.

 50 లక్షలు చెల్లించడానికి రెడీ అంటూ

50 లక్షలు చెల్లించడానికి రెడీ అంటూ

బిగ్‌బాస్ ఇంటిలో ఒకరి జీవితంపై గానీ, వ్యక్తిగత అంశాలపై టార్గెట్ చేస్తే బయటకు వెళ్లిపోతాను. అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోతే నాకు ఇస్తానని చెప్పిన కంటెస్టెంట్ రూ.50 లక్షల రెమ్యునరేషన్‌ను ప్రతిఫలంగా చెల్లించడానికి రెడీగా ఉన్నాను. నేను బయటకు వెళ్లి 50 లక్షల లోన్ తీసుకొని వారికి జరిమానా చెల్లిస్తాను గానీ.. ఇంట్లో ఇలాంటి సంఘటనలు భరించలేకపోతున్నాను అని మణికుట్టన్ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం మణికుట్టన్ రెమ్యునరేషన్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X