‘ముఖ్యమంత్రికి దమ్ముందా? ఎంపురాన్‌పై మాట్లాడే హక్కుందా? ఆ రెండు సినిమాలేంటి?’

ఎంపురాన్ సినిమా వివాదం పార్టమెంట్ ఎగువ సభను కుదిపేసింది. లెఫ్ట్ పార్టీ ఎంపీ జాన్ బ్రిట్టాస్, కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపి, నటుడు సురేష్ గోపి మధ్య వాడివేడిగా వాగ్వాదం చోటు చేసుకొన్నది. రాజ్యసభలో లెఫ్ట్ పార్టీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సురేష్ గోపి మాట్లాడుతూ.. లెఫ్ట్ పార్టీ ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఇతర సభ్యులను కడిగిపడేశారు. ఎంపురాన్ సినిమాపై బీజేపీ పార్టీ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, వారి ఇష్టప్రకారమే 20కి పైగా కట్స్ చేశారని ఆయన వెల్లడించారు. రాజ్యసభను కుదిపేసిన ఆయన ప్రసంగం వివరాల్లోకి వెళితే..

ఎంపురాన్ సినిమా గురించి సభలో ఆయన మాట్లాడాడు. ఆయనకు ధైర్యం ఉందా? ఉంటే? టీపీ చంద్రశేఖరన్‌పై తీసిన సినిమా టీపీ 51 (TP 51) కట్స్‌తో రీ రిలీజ్ చేసే దమ్ముందా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే సినిమాను కూడా వారు రిలీజ్ చేసే దమ్ముందా? నేను చెప్పిన రెండు సినిమాలను కట్స్‌తో రీ రిలీజ్ చేసే దమ్ముందా? ఆ రెండు చిత్రాలను విడుదల చేసే దమ్ము కేరళ ముఖ్యమంత్రికి ఉందా? ఆ రెండు సినిమాలను వారికి గట్స్ ఉండాలి. ఆతర్వాతనే వారు ఎంపురాన్ సినిమా గురించి మాట్లాడాలి అని సురేష్ గోపి డిమాండ్ చేశారు.

BJP MP Suresh Gopi befitting Reply to Left Parties

టీపీ 51, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సినిమాలను రాజ్య సభ ఎంపీ బ్రిట్టాస్ గానీ, కైరళీ ఛానెల్‌ గానీ రిలీజ్ చేస్తుందా? కైరళీ ఛానెల్‌ను ప్రముఖ నటుడు నిర్వహిస్తున్నాడు. గొప్పవారైనా ఆయన పేరును ఈ సభలో బయటకు వెల్లడించడం నాకు ఇష్టం లేదు. నేను మరోసారి లెఫ్ట్ పార్టీ సభ్యులను డిమాండ్ చేస్తున్నాను. వారికి ఈ విషయంలో దమ్ముందా? అని ఆవేశంగా మాట్లాడారు. దాంతో మీరు సభ మర్యాదలను తుంగలో తొక్కి అభ్యంతరకరమైన రీతిలో భాషా ప్రయోగం చేస్తున్నారు అని లెఫ్ట్ సభ్యులు అడ్డుకొన్నారు. దాంతో నా భాషలో ఎలాంటి తప్పు లేదు అని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు.

సభాధ్యక్షుడిని నేను ఒక్కటే కోరుతున్నాను. వారికి ఆ రెండు సినిమాలు ప్రదర్శించే దమ్ముందా? ఆ తర్వాత ఎంపురాన్ గురించి విమర్శించాలి అని లెఫ్ట్ సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దేశ పౌరులకు నేను ఒక్కటే చెప్పాలని అనుకొంటున్నాను. ఎంపురాన్ నిర్మాతలపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ వివాదం నా దృష్టికి వచ్చిన వెంటనే వారికి కాల్ చేశాను. సినిమాలో నా పేరుతో వేసిన థ్యాంక్స్ కార్డును తొలగించాలని రిక్వెస్ట్ చేశాను. ఈ సభలో నేను తప్పుగా మాట్లాడితే.. ఎలాంటి శిక్షకైనా సిద్దమే. మీరు నాకు ఎలాంటి శిక్షనైనా విధించవచ్చు అని నటుడు, బీజేపీ ఎంపీ సురేష్ గోపి సవాల్ విసిరారు.

ఎంపురాన్ సినిమా వివాదంపై నేను మాట్లాడే మాటలు రాజ్యసభలో ఆన్ రికార్డుగా ఉండేలా మాట్లాడుతున్నాను. దర్శకుడు, నిర్మాత అంగీకారంతో 17 కట్స్ చేయాలని సూచించాను. అయితే ఎంపురాన్ సినిమాను ఉపయోగించుకొని నా రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. నా పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు అని సురేష్ గోపి ఆవేశంగా ప్రసంగించారు.

BJP MP Suresh Gopi befitting Reply to Left Parties

ఇక సురేష్ గోపి ప్రస్తావించిన రెండు సినిమాల గురించిన వివరాల్లోకి వెళితే.. కేరళలో ప్రముఖ రాజకీయ నేత టీపీ చంద్రశేఖరన్ జీవితం, ఆయన హత్య నేపథ్యంగా టీపీ 51 (TP 51) అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు మొయిడూ తజాత్ దర్శకత్వం వహించారు. టీపీ చంద్రశేఖరన్‌ను దారుణంగా హత్య చేసిన సమయంలో ఆయన దేహంలో 51 గాయాలు ఉన్నాయి. ఈ కథా నేపథ్యంగా మూవీని తీశారు. అలాగే మరో వివాదాస్పద చిత్రం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ (Left Right Left) సినిమాను కట్స్ చేసి ప్రదర్శించాలని ఎంపీ, నటుడు సురేష్ గోపి డిమాండ్ చేయడం తెలిసిందే.

More from Filmibeat

Read more about: suresh gopi mohanlal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X