twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగిన 1000 కోట్ల మహాభారతం .. నిర్మాత, దర్శకుడికి తీవ్ర విభేదాలు.. మోహన్‌లాల్‌కు షాక్!

    |

    బాహుబలి చిత్రం తర్వాత దక్షిణాదిలో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణంపై అనేక వార్తలు మీడియాలో పొంగిపొర్లాయి. ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండమూజమ్ పుస్తకం ఆధారంగా రూ.1000 కోట్లతో మహాభారతం సినిమాను తెరకెక్కిస్తున్నట్టు యూఏఈకి చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి ప్రకటించడం దేశ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే తాజా వార్తల ప్రకారం ఆ చిత్ర నిర్మాణం వాయిదా పడినట్టు స్వయంగా నిర్మాత ప్రకటించడం గమనార్హం. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..

    దర్శకుడితో విభేదాల కారణంగానే

    దర్శకుడితో విభేదాల కారణంగానే

    రూ. 1000 కోట్లతో సినిమాపై నిర్మాత బీఆర్ శెట్టి వివరణ ఇచ్చాడు. దర్శకుడు వీఏ శ్రీకుమార్ మీనన్‌తో కొన్ని విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం మంచి స్క్రిప్టు రైటర్ కోసం వెతుకుతున్నాను. సమయం పట్టొచ్చు కానీ తప్పుకుండా ఆ సినిమాను తెరకెక్కిస్తాను. ఆ సినిమా రూపకల్పనకు కట్టుబడి ఉన్నాను. నిజమైన భారతీయుడిగా ప్రపంచవ్యాప్తంగా మన చరిత్ర అన్ని భాషల్లో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని బీఆర్ శెట్టి అన్నారు.

    సినిమా ఫైనలైజ్ కాలేదు: మోహన్ లాల్

    సినిమా ఫైనలైజ్ కాలేదు: మోహన్ లాల్

    ఇటీవల రాండమూజమ్ సినిమా గురించి మోహన్ లాల్ మాట్లాడుతూ.. అందులో ఏ పాత్రలో నటిస్తున్నానే విషయం నాకే తెలియదు. ఇంకా ఆ సినిమా గురించి నాకు కచ్చితమైన సమాచారం లేదు. ఇంకా ఆ సినిమా ఫైనలైజ్ కాలేదు. ఒకవేళ దాని గురించి తెలిస్తే వివరాలు మీడియాకు వెల్లడిస్తాను అని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మోహన్ లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

     దర్శకుడు మీనన్ వివరణ

    దర్శకుడు మీనన్ వివరణ

    రాండమూజమ్ సినిమా వివాదంపై దర్శకుడు వీఏ శ్రీకుమార్ మీనన్ స్పందిస్తూ.. రెండేళ్ల క్రితం ఎంటీ వాసుదేవన్ నాయర్‌ను కలిశాను. పుస్తకాన్ని సినిమాగా తీద్దామని ఆసక్తితో ఉన్నాను. ప్రాంతీయ సినిమా రేంజ్‌ను మించి తీయాలనే కోరిక ఉంది. ఈ సినిమాను ప్రపంచం గర్వపడే చిత్రంగా మలచడానికి అత్యుత్తమ టెక్నిషియన్స్ తీసుకొస్తానని మాటిచ్చాను. దాంతో నాలుగు నెలల తర్వాత ఆయన నాకు ఫుల్ బౌండ్ స్క్రిప్టు ఇచ్చారు అని అన్నారు.

    నిరాశలో మోహన్ లాల్ ఫ్యాన్స్

    నిరాశలో మోహన్ లాల్ ఫ్యాన్స్

    ప్రస్తుతం బీఆర్ శెట్టి వ్యాఖ్యలతో రాండమూజమ్ సినిమా అటకెక్కినట్టు అర్ధమైంది. మీడియా సమావేశంలో ఆయన వెల్లడించిన విషయాలతో మోహన్ లాల్ ఫ్యాన్స్, మలయాళ సినీరంగ తీవ్ర నిరాశకు గురైనట్టు వార్తలు వచ్చాయి. భవిష్యత్‌లోనైనా సినిమా తెరకెక్కితే మలయాళ సినీ పరిశ్రమ ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Prestigious Malayalam movie based on the book Randamoozham written by MT Vasudevan Nair. The project was supposed to bankrolled by UAE based businessman BR Shetty on a mammoth amount of Rs 1000 crore. BR Shetty said that he has opted out of the project after differences between the director VA Shrikumar Menon and wrote MT Vasudevan Nair cropped up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X