ప్రియా ప్రకాష్‌కు లైన్ క్లియర్.. ఆమె కన్ను కొట్టిందని, పనీపాటా లేదా!
Recommended Video

ప్రియా ప్రకాష్ వారియర్.. కొన్ని నెలల వరకు ఈ పేరు గురించి ఎవరికీ పరిచయం లేదు. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో నన్ను గీటిన సాంగ్ తో యువత ఆమెకు ఫిదా అయిపోయారు. ప్రియా వారియర్ కొంటె చూపులు యువత హృదయాలకు చిల్లు పెట్టాయి. ఆమె కన్నిగీటిన వీడియోని రిపీట్ మోడ్ లో పెట్టి మరీ జపం చేశారు. ఒక్క టీజర్ తో ప్రియా నేషనల్ స్టార్ గా మారిపోయింది. ఈ వీడియో పై అదేస్థాయిలో దుమారం రేగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ చిక్కులు ప్రియా వారియర్ కు తప్పాయి.

నాలుగు నెలలుగా
ఒరు ఆధార్ లవ్ చిత్రంలో ప్రియా వారియర్ ముస్లిం మనోభావాల్ని కించపరిచేలా కన్ను కొట్టిందని కొందరు ముస్లింలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నాలుగు నెలలుగా విచారణ కొనసాగుతోంది. సుప్రీం న్యాయమూర్తి తాజా వ్యాఖ్యలతో ప్రియా వారియర్ కు ఈ కేసు నుంచి చిక్కులు తప్పినట్లు అయింది.

పనీపాటా లేదా
ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ఎవరో ఎదో సినిమాలో పాట పెట్టారని మీరు కేసు వేయడమేనా.. పనీపాటా లేదా మీకు అంటూ చురకలు అంటించారు.

ఒక్క వీడియోతో
ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని ఒక్క వీడియోతో ప్రియవారియర్ నేషనల్ స్టార్ గా మారింది. యువకులు, స్టార్స్, సీనియర్ నటీనటుల వరకు అంతా ప్రియా జపం చేశారు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ కు అన్ని భాషల్లో సినీ అవకాశాలు కూడా వస్తున్నాయి.

త్వరలో విడుదల
ఒరు ఆధార్ లవ్ చిత్రానికి కేసు చిక్కులు ఇక వీడినట్లే. త్వరలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. టీనేజ్ రొమాన్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











