40 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడబోతున్న "దసరా" విలన్.. ఎవరో గుర్తు పట్టారా?
మలయాళ సినీ రంగానికి చెందిన షైన్ టామ్ చాకో గురించి తెలుగు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తూ... వరుస చిత్రాల్లో ఛాన్స్ లు కొట్టేసే ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా గతేడాది న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించిన చాకోను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు కావచ్చు. అద్భుతంగా నటించి అందరినీ భయపెట్టిన ఈ విలన్ యే తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అయితే ఇతడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఎప్పుడు చేసుకోబోతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1984లో పుట్టిన షైన్ టామ్ చాకో ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసు కల్గిన కెరియర్ పరంగా దూసుకెళ్తున్నారు. కానీ పర్సనల్ లైఫ లో మాత్రం అలాగే ఉన్నారు. చాలా కాలంగా ఈయన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వాటి గురించి చాకో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ ఆ అమ్మాయితో చాకో కలిసి దిగిన ఎన్నో ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు ఈ హీరో కమ్ విలన్.

ముఖ్యంగా షైన్ టామ్ చాకో ప్రేమించిన అమ్మాయి పేరు తనూజ. చాలా కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అతి తక్కువ మంది సన్నిహితులు, స్నేహితుల మధ్యే వీరి నిశ్చితార్థం జరిగింది. అదే విషయాన్ని చాకో సోషల్ మీడియా వేధికగా ప్రకటిస్తూ.. తమ ఫొటోలను షేర్ చేశాడు. అందులో ఈ బ్యూటిఫుల్ కపుల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. వైట్ అండ్ బేబీ పింక్ కాంబోలో వీరిద్దరూ సేమ్ డ్రెస్ లు వేసుకున్నారు. చాలా అందంగా ముస్తాబై తమ స్పెషన్ మూమెంట్ ను మరింత స్పెషల్ గా మలుచుకున్నారు.
అయితే తాజాగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనవరిలోనే లేదా ఫిబ్రవరిలోనో వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని టాక్ నడుస్తోంది. షైన్ టామ్ చాకోకు ఇది వరకే పెళ్లి అయిందని.. ఒక పాపో బాబో కూడా ఉన్నట్లు వికీపీడియాలో కనిపిస్తోంది. కానీ ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అసలు ఎలాంటి విషయాలు వెలుగులోకి రాలేదు. ఇందులో నిజం ఎంత ఉందనేది మాత్రం ఇంకా తెలియదు. కానీ చాకో మాత్రం అధికారకంగా తనూజతో నిశ్చితార్థం చేసుకుని వెల్లడించాడు. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
ఇదంతా ఇలా ఉండగా.. షైన్ టామ్ చాకో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్లుగా చేస్తున్న దేవరలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆయన దసరా సినిమాతో పాటు రంగబలిలోనూ విలన్ గా నటించి మెప్పించారు. మరి దేవరలో ఏ రేంజ్ లో ఎన్టీఆర్ ను ఢీకొంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











