ప్రముఖ కమెడియన్ అనుమానాస్పద మృతి.. ‌మృతికి కారణం ఏమిటంటే?

మలయాళ సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ప్రముఖ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నవస్ ఇకలేరు. షూటింగ్ నిమిత్తం కోచికి వచ్చిన ఆయన హోటల్ రూమ్‌లో శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఆయన మృతి వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ సంతాపం ప్రకటిస్తున్నారు. కళాభవన్ నవస్ మరణం, ఆయన జీవిత విశేషాల గురించిన వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటుడు అబూబాకర్ కుమారుడైన కళాభవన్ నవస్ కేరళలోని వాడక్కచెరీకి చెందిన వాడు. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఆయన 1995 సంవత్సరంలో నటుడిగా మలయాళ సినీ రంగంలోకి అడుగు పెట్టారు. బాలు కిరియాత్ రూపొందించిన మిమిక్ యాక్షన్ 500 సినిమా ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. నటుడిగానే కాకుండా మిమిక్రి ఆర్టిస్టుగా, గాయకుడిగా పేరు సంపాదించుకొన్నారు.

Kalabhavan Navas passed away

కళాభవన్ నవస్ కెరీర్ వషయానికి వస్తే.. హిట్లర్ బ్రదర్స్, మీనాక్షి కల్యాణం, చందమామ, వన్ మ్యాన్ షో, థిల్లాన థిల్లాన, కోబ్రా చిత్రాల్లో నటించారు. ఇటీవల పాపులర్ చిత్రాలు డ్రైవింగ్ లైసెనస్, డిటెక్వివ్ ఉజ్వలన్, ఓరు అన్వేషనషింతే తుడక్కమ్ చిత్రాల్లో నటించారు. టిక్కి టాక, ప్రకంబనమ్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. టెలివిజన్ రంగంలో కూడా మంచి పాపులారిటీని సంపాదించారు.

షూటింగ్ కోసం చోట్టానిక్కరలోని హోటల్‌లో బస చేశారు. ఆయన గది తలుపు ఎంతకు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా.. విగత జీవిగా కనిపించారు. ఆయనను వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే వైద్యులు అప్పటికే ఆయన మరణించారని ధృవీకకించారు అని పోలీసులు తెలిపారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

నటుడిగా రాణిస్తూనే మలయాళ నటి రేహనా నవస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. పెద్దల అంగీకారంతో 2002 సంవత్సరంలో వారి పెళ్లి జరిగింది. నవస్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

More from Filmibeat

Read more about: malayalam Detective Ujjwalan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X