దిలీప్‌కు మరో షాక్.. వేగవంతం కానున్న కేసు విచారణ!
మలయాళీ నటిపై లైంగికంగా దాడి జరిగిన ఘటనలో నటుడు దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ కేసు విచారణ కొసనసాగుతూనే ఉంది. కేరళ ప్రభుత్వం తాజా చర్య నటుడు దిలీప్ కు షాక్ ఇచ్చే విధంగా ఉందని చెప్పొచ్చు.
నటుడు దిలీప్ కావాలనే కేసు విచారణ నెమ్మదిగా జరిగేలా ప్రవర్తిస్తున్నాడని కేరళ ప్రభుత్వం హైకోర్టులో పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ ధాఖలు చేసింది. ప్రత్యేక విచారణ చేపట్టి కేసు వేగంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

మహిళా జడ్డి కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ప్రత్యేకమైన విచరణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కనుక జరిగితే దిలీప్ మరింతగా చిక్కుల్లో పడ్డట్లే. మరో వైపు ఈ కేసులో సిబిఐ విచారణ జరిపించాలని దిలీప్ కూడా హై కోర్టుని ఆశ్రయించాడు. దిలీప్ వ్యవహారంతో కేరళ సినిమా సంస్థ అమ్మా లోకూడా వివాదాలు ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











