యువ దర్శకుడికి తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌లో సినీ ప్రముఖుల పరామర్శ
ప్రముఖ దర్శకుడు, మలయాళం ఫిల్మ్ మేకర్ బాలా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం కేరళలోని కోచిలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యలు, శారీరకంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో బాలాను హాస్పిటల్‌లో చేర్పించామని వైద్యులు తెలిపారు. గతవారం అస్వస్థతకు గురవ్వడంతో బాలా హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత వెంటనే డిశ్చార్జి అయ్యారు. మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం బాలా వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిసింది. బాలాకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాల్లోకి వెళితే..
హాస్పిటల్‌లో చేరిన బాలాను నటుడు ఉన్ని ముకుందన్, ప్రొడక్షన్ డిజైనర్ బాదుషా ఎన్ఎమ్ వ్యక్తిగతంగా పరామర్శించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. నేను, ఉన్ని ముకుందన్, విష్ణు మోహన్, స్వరాజ్, విపిన్ కలిసి అమృతా హాస్పిటల్‌కు వెళ్లాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మాతో కాసేపు మాట్లాడారు. అని బాదుషా ఫేస్‌బుక్‌లో చేరారు.

దర్శకుడు బాలా కెరీర్ విషయానికి వస్తే.. షెఫిక్కింతే సంతోషం చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో అమీర్ అనే పాత్రలో నటించారు. ఉన్ని ముకుందన్ కీలక పాత్రను పోషించారు. మై డియర్ మెకాన్స్, బిలాల్, స్థలం అనే చిత్రాలను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











