twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కావాలని టార్గెట్ చేస్తున్నారు: ముద్దు సీన్లకు ప్రియా వారియర్ సై అంది, కానీ అతడే..

    |

    ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ నటించిన తొలి చిత్రం 'ఓరు అడార్ లవ్' తెలుగులో 'లవర్స్ డే'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్లో తన కో స్టార్ రోషన్‌తో ప్రియా వారియర్ లిప్ లాక్ ముద్దు సీన్లు చేస్తూ కనిపించడం ఇంటర్నెట్లో వైరల్ అయింది.

    దర్శకుడు ఒమర్ లులు మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముద్దు సీన్ చేయాలని చెప్పగానే ప్రియా వారియర్ ఏమాత్రం సంకోచించలేదని, అయితే రోషన్ ఈ సీన్ చేయడానికి కాస్త వెనకంజ వేశాడని, కెమెరా ముందు ఆ సీన్ చేయడానికి భయ పడ్డాడని తెలిపారు.

    ముద్దు సీన్ మీద చాలా ట్రోలింగ్

    ముద్దు సీన్ మీద చాలా ట్రోలింగ్

    ఈ లిప్ లాక్ సీన్ విషయంలో కొందరు కావాలని ప్రియా వారియర్‌ను టార్గెట్ చేస్తున్నారని, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాలో ట్రోలింగ్ చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా దర్శకుడు మీడియాకు వెల్లడించారు. ఇదంతా సినిమా కథలో భాగమే అని గుర్తించాలన్నారు.

    అలాంటపుడు పర్ఫెక్టుగా ఎలా వస్తుంది?

    అలాంటపుడు పర్ఫెక్టుగా ఎలా వస్తుంది?

    కొందరు ప్రియా వారియర్, రోషన్ మధ్య ముద్దు సీన్ పర్ఫెక్టుగా లేదని విమర్శిస్తున్నారు. అక్కడ హీరోయిన్ అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవాలి... అలాంటపుడు అది పర్ఫెక్టుగా ఎలా వస్తుంది? సహజసిద్ధంగా ఉండాలనే దాన్ని అలా డిజైన్ చేశామని ఒమర్ లులు తెలిపారు.

    కారణం లేకుండా టార్గెట్ చేస్తున్నారు.

    కారణం లేకుండా టార్గెట్ చేస్తున్నారు.

    కొందరు కారణం లేకుండా మా సినిమాపై దుమ్ముత్తి పోస్తున్నారు. ఒక సినిమా మేకింగ్ వెనక చాలా హార్డ్ వర్క్, ఎంతో మంది కష్టం ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సినిమా విడుదల కాకముందే మమ్మల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరైంది కాదని ఒమర్ లులు అభిప్రాయపడ్డారు.

    లవర్స్ డే

    లవర్స్ డే

    తెలుగులో ‘లవర్స్ డే' పేరుతో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ప్రియా వారియర్‌తో పాటు నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ నటిస్తున్నారు.

    English summary
    Priya Prakash Varrier's hot lip-lock with co-star Roshan from the movie 'Oru Adaar Love' is now the latest sensation on social media platforms. Dirtector Omar Lulu revealed that Priya Prakash Varrier was perfectly fine with doing a lip-lock on screen. However, the director added that Roshan was little hesitant to do the intimate act in front of the camera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X