Top 5 Heroines: మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మమిత భైజు.. మిగితా స్థానాల్లో ఎవరెవరంటే?

జీవితం మారిపోవడానికి ఒక్క ఛాన్స్ చాలు అన్నట్లు .. సినిమా వాళ్లకు ఒక్క సినిమా చాలు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి స్టార్లుగా వెలుగొందిన వారు కొందరైతే, ఒకే ఒక్క సినిమా అట్టర్ ఫ్లాప్‌తో అడ్రస్ లేకుండా పోయిన వారు ఎందరో. సక్సెస్ వెంట పరుగులు తీసే సినీ పరిశ్రమలో ఈ సూత్రాన్ని గుర్తుంచుకుని పడినా లేచి పరిగెత్తేవారే చివరిదాకా ఉంటారు, లేదంటే మిడిల్ డ్రాప్ కావాల్సిందే. అలా ఒకే ఒక్క సినిమాతో మాయ చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్నారు మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు. ప్రేమలు సినిమా సంచలన విజయం సాధించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది.

ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టింది. నేరుగా టాలీవుడ్‌లో నటించకపోయినా ఈ డబ్బింత్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆమె ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. ప్రేమలు ప్రమోషన్స్ సమయంలో మమిత పాత వీడియోలు, రీల్స్, డ్యాన్స్ క్లిప్పులు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి.

Do you know Mamitha Baiju most popular actress in Malayalam Here is Ormax India survey about top heroines

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి తోడు ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రేమలు మూవీలో మమిత డ్రెస్సింగ్ స్టైల్ , హెయిర్ స్టైల్‌‌కు ఫిదా అయిన అమ్మాయిలు ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టడంతో తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదంతా కేవలం ఒక్క సినిమాకే సుమా.

నేటితరం అమ్మాయిల్లాగా మోడ్రన్, ట్రెండీ వేర్ ధరించకుండా ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల వైపే మొగ్గు చూపడం కూడా యువతకు ఆమె పట్ల మంచి ఓపీనియన్ తెచ్చిపెట్టింది. అయితే హీరోయిన్ కావడంతో హద్దులు దాటకుండా లేటెస్ట్, ట్రెండింగ్ , ఫ్యాషన్ దుస్తులను ధరించి ఫోటో షూట్లలో పాల్గొంటారు మమిత. నిజానికి ప్రేమలు ఆమె తొలి చిత్రం కాదు.. అది మమితకు 16వ సినిమా. 2017లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె 18 చిత్రాల్లో నటించగా.. ప్రేమలతో ఎనలేని గుర్తింపును దక్కించుకుంది.

Do you know Mamitha Baiju most popular actress in Malayalam Here is Ormax India survey about top heroines

ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం సినిమాలతో తనలోని నటిని పరిచయం చేసింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో మమితకు దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వరుసపెట్టి క్యూకడుతున్నాయి. ఇప్పటికే తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్ సరసన రెబల్‌లో నటించగా.. తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన మమితకు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కినట్లుగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మమిత మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక '' ఓర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ (మలయాళం) జాబితాలో ఈ చిన్నది అగ్రస్థానంలో నిలిచింది. సీనియర్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి మమిత ఈ ఘనతను అందుకుంది. ప్రేమలు విజయం ఆమెకు ఈ పాపులారిటీని సంపాదించేలా చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఓర్మాక్స్ ఇండియా సర్వే లిస్ట్‌లో మంజు వారియర్, శోభన, అనశ్వర రాజన్, ఐశ్వర్య లక్ష్మీలు మమిత తర్వాతి స్థానాల్లో నిలిచారు. దీంతో మమిత మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు, సోషల్ మీడియా ద్వారా అభిమానులు , సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే స్పీడులో ఆమె మరిన్ని సంచలనాలు సృష్టిస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X