ప్రేమలుతో యువత గుండెల్లో మమితా బైజు కితకితలు.. హీరోయిన్‌ కాకముందు ఈ బ్యూటీ ఏం జాబ్ చేసేదో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా, తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి హీరోయిన్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం సైకాలజిస్ట్ లాంటి సక్సెస్ ఫుల్ కెరీర్ ను వదిలేసి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. 23 ఏళ్లకే ఇండస్ట్రీని షేక్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన పేరును మార్మోగేలా చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళ రొమాంటిక్ డ్రామా ప్రేమలు మూవీ ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాలో ఒకటిగా నిలిచింది. కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అంచనాలే లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు.

Do You Know Premalu Fame Mamitha Baiju Was psychologist before entry into Malayalam Film Industry

ముఖ్యంగా హీరోయిన్ మమిత బైజుకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే సైకాలజిస్ట్ గా కెరీర్ ను వదిలేసి ఆమె ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సమయానికి ఆమె ఏజ్ కేవలం 23 ఏళ్ళే కావడం విశేషం.

మమిత బైజు కేరళలోని కిడంకూరులో జన్మించింది. తన తండ్రి డాక్టర్ కావడంతో ఆమె కూడా డాక్టర్ కావాలనే చదువుకోవడం మొదలు పెట్టింది. మమిత తల్లిదండ్రుల కోరిక కూడా అదే. సైకాలజీలో బిఎస్సి చదువుకోవడానికి కొచ్చిలోని సేక్రేడ్ హార్ట్ కాలేజీలో చేరింది ఈ బ్యూటీ.

అయితే అలా డాక్టర్ కావాల్సిన ఈ చిన్నది అనుకోకుండా 2001లో 16 సంవత్సరాల వయసులో సర్వోరి పాలక్కన్‌ అనే మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఎంట్రీ ఇవ్వగానే స్టార్ హీరోయిన్ అయిపోలేదు ఈ బ్యూటీ. కొన్ని పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా పలు టీనేజ్ డ్రామాల్లో నటించి కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.

Do You Know Premalu Fame Mamitha Baiju Was psychologist before entry into Malayalam Film Industry

అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ 2021లో రిలీజ్ అయిన ఆపరేషన్ జావా మూవీతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత రెండేళ్లలోనే ఖోఖో, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. కానీ ఈ ఏడాది ఆమె నటించిన ప్రేమలు మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మమిత బైజు పేరు మార్మోగిపోయింది.

కేవలం మూడు 3 బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 136 కోట్లను రాబట్టి 2024 లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2024 మార్చ్ లో రిలీజ్ అయిన రెబల్ మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మమిత.

ఇక ఈ ఒక్క మూవీతోనే కృతి సనన్, కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను సైతం వెనకబడేలా చేసింది 23 ఏళ్ల మలయాళ బ్యూటీ మమిత. 2024లో రిలీజ్ అయిన ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టింది మమత నటించిన ప్రేమలు మూవీ. మొత్తానికి 23 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ హీరోయిన్లను సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఓడించిన ఘనతను సొంతం చేసుకుంది మమిత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X