సినీ పెద్దల ఇగోల వల్లే యువహీరోల జీవితాలు నాశనం.. దృశ్యం యాక్టర్ ఫైర్
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ నేపథ్యంలో ఇన్‌సైడర్స్, సినీ పెద్దల వ్యవహారంపై భారీగా చర్చ జరుగుతుంటే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన యువ హీరో నీరజ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దల ఇగో కారణంగానే యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని చేసిన వ్యాఖ్యలు మలయాళ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. యువ హీరో చేసిన వ్యాఖ్యలపై సినీ పెద్దలు, సంఘాలు మండిపడుతూ హద్దు మీరారంటూ నోటీసులు జారీ చేయడం వివాదంగా మారింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్‌లో నీరజ్ మాధవ్ కెరీర్..
మలయాళ చిత్ర పరిశ్రమలో యువ హీరో నీరజ్ మాధవ్ ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాల్లో నటించారు. దృశ్యం, ఓరు ఇండియన్ ప్రన్యకథ, ఓరు వాడెకెన్ సెల్ఫీ, ఓరు మెక్సికన్ అపార్థ లాంటి చిత్రాల్లో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. ప్రతిభావంతుడని పేరు తెచ్చుకొన్నప్పటికీ అవకాశాలు తలుపు తట్టకపోవడంతో నీరజ్ మాధవ్ డిప్రెషన్‌లోకి వెళ్లేంత పరిస్థితి ఏర్పడింది.

నీరజ్ మాధవ్ కామెంట్స్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేపథ్యంలో నీరజ్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో యువకులపై పెద్దల వేధింపులు ఎక్కువగానే ఉన్నాయి. వారి ఇగోల వల్ల యువ హీరోలు జీవితాలు నాశనం అవుతున్నాయి. 2013 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ ఓ హెయిర్ డ్రస్సర్‌కు లభించిన అవకాశాలు కూడా యువకులు లభించడం లేదు. వారి మాదిరిగా సంపాదన కూడా రావడం లేదు అనే విషయాన్ని వెల్లడించారు.

మాధవ్ వ్యాఖ్యలపై సంఘాలు ఫైర్
యువ హీరో నీరజ్ మాధవ్ వ్యాఖ్యలు దుమారం లేపడంతో వివరణ ఇవ్వాలని మలయాళ నటులు, సాంకేతిక నిపుణుల సంస్థ ఫెఫ్కా నోటీసులుజారీ చేసింది. మాధవ చేసిన వ్యాఖ్యలు సినీ పెద్దల మనోభావాలు దెబ్బ తిన్నాయి. పలువురు మాధవ్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పాలని నటులు సంఘం అమ్మకు కూడా లేఖ రాసింది.

ఎవరిని ఉద్దేశించి చేశారో చెప్పాలి..
నీరజ్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారనే విషయాన్ని వెల్లడించకుండా అందరిని ఉద్దేశించి విమర్శలు చేయడం సబబు కాదు. ఏదైనా ఆయను అసంతృప్తి ఉంటే స్పష్టంగా తన వైఖరి, అభిప్రాయాలను బహిరంగంగా కాకుండా అసోసియేషన్ పరిధిలో చర్చించాల్సి ఉండాల్సింది. ఇలా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ఎంత వరకు సమంజసం అంటూ సంఘాలు మండిపడ్డాయి.
Recommended Video

వ్యక్తిగత అభిప్రాయలు చెబితే..
ఇలా నీరజ్ మాధవ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక యువ హీరో భవిష్యత్ ఏంటనే మాటలు ఓ వర్గం వినిపిస్తున్నాయి. అభిప్రాయాలను వ్యక్తిగతం వెల్లడించడానికి హక్కు లేదా అంటూ కొందరు నీరజ్ మాధవ్‌కు సపోర్టుగా నిలిచారు.


Click it and Unblock the Notifications











