మాల్ ప్రారంభించిన హీరోను చూసేందుకు వచ్చి అభిమాని మృతి
తమ అభిమాన హీరోను చూడటానికి వచ్చి గుండెపోటుకు గురై వ్యక్తి మరణించిన సంఘటన కేరళలో శనివారం చోటు చేసుకుంది. కేరళలోని కొల్లంలో ఓ మాల్ ప్రారంభించడానికి హీరో దుల్కల్ సల్మాన్ వస్తున్నాడనే విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా తరలి వచ్చిన సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
హరి అనే 45 సంవత్సరాల వ్యక్తి దుల్కర్‌ను చూడటానికి తిరువనంతపురం నుండి కొల్లాం వచ్చారు. దుల్కర్ రాగానే ఒక్కసారిగా జనం ఎగబడటంతో చిన్నపాటి తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో హరి గుండెపోటుకు గురైనట్లు సమాచారం.

వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాగా అతడు అప్పటికే మరిణించినట్లు వైద్యులు చెప్పారు. హరికి ఇంతకు ముందే గుండె సంబంధమైన సమస్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మాల్ ప్రారంభోత్సవం చేయడంపై ఐ మాల్ వెబ్ సెంటర్ ఓనర్ మీద ఐపిసి సెక్షన్ 283 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యంగా గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు సైతం ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











