మమ్ముట్టి, దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై ఈడీ దాడులు.. భారీ కుంభకోణంపై కూపీ లాగుతున్న అధికారులు
కేరళలో భూటాన్ విలాసవంతమైన కార్ల స్మగ్లింగ్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. సినీ తారలు, వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) అధికారులు మెరుపుదాడులు చేస్తున్ారు. గత కొద్ది వారాలుగా కేరళ, తమిళనాడులో ఈడీ అధికారులు పన్ను ఎగవేతకు పాల్పడి విలాసవంతమైన, ఖరీదైన కార్లను అక్రమంగా భూటాన్ నుంచి తెప్పించుకొన్న వారి చిట్టాను బయటపెట్టి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల వెనుక అసలు వివరాల్లోకి వెళితే..
కేరళలో కొద్ది రోజుల క్రితం దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై ఈడీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. అయితే వారి నివాసాల్లోని ఖరీదైన కార్లను తనఖీలు చేపట్టి వివరాలు సేకరించారు. అంతేకాకుండా దుల్కర్ నివాసంలో కొన్ని కార్లను సీజ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ దాడుల పర్వం ఆగిపోయిందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా మరోసారి కేరళ సినీ ప్రముఖుల నివాసాల్లో సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది.

ఫెమా, మనీలాండరింగ్, టాక్స్ ఎగవేత ఆరోపణల కింద ఈడీ అధికారులు కేరళ, తమిళనాడులోని 17 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలక్కల్ నివాసాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు అని తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈలమ్‌కులమ్‌లోని మమ్ముట్టి నివాసంలో సోదాలు నిర్వహించారు. అలాగే కోచి, చెన్నైలోని దుల్కర్ సల్మాన్ నివాసంలో కూడా రైడ్స్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్ానయి. అలాగే కేరళలోని మరో ఐదు జిల్లాలోని ఆటోమొబైల్ డీలర్లకు సంబంధించిన షాపులు, నివాసాలపై దాడులు కొనసాగుతున్నాయి అని తెలిసింది.
విలాసవంతమైన వాహనాల భారీ స్కామ్ వివరాల్లోకి వెళితే.. భూటాన్, నేపాల్ నుంచి అక్రమంగా టాయోటా, లాండ్ క్రూజర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాంటి హైల ఎండ్ వాహనాలను పన్ను ఎగవేతకు పాల్పడి దిగుమతి చేసుకొన్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టగా..అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల రిజిస్ట్రేషన్స్‌తో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇండియన్ ఎంబసీ, విదేశాంగ శాఖ కార్యాలయం, యూఎస్ ఎంబసీల వద్ద అక్రమాలు చేశారు అనే విషయం బయటకు వచ్చింది. దాంతో కూపీ లాగడంతో సినీ తారలు, పలువురు ప్రముఖుల వ్యవహారాలు బయటపడ్డాయి. దాంతో అధికారులు దాడులకు జరుపుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా భూటన్ నుంచి అక్రమ మార్గంలో విలాసవంతమైన, అత్యంత ఖరీదైన వాహనాలను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే కుంభకోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆపరేషన్ నుమ్కూర్ (భూటాన్ భాషలో వాహనం) పేరుతో భారతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించారు. కేరళలో పృథ్వీరాజ్, దుల్కర్ నివాసాలపై దాడుల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











