షూటింగులో అపశృతి, హీరో ఒంటికి మంటలు... (వీడియో)

మలయాళ నటుడు టోవినో థామస్ షూటింగులో గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'ఎడక్కడ్ బాటలియన్ 06' అనే సినిమా షూటింగులో స్టంట్స్ చేస్తుండగా ఒంటికి మంటలు అంటుకున్నాయి. అయితే వెంటనే చిత్ర బృందం స్పందించడంతో చిన్నపాటి గాయాలతో బయట పడ్డాడు.

స్వప్నేష్ కె నాయర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ సీన్లో చుట్టూ మంటలతో కూడిన ప్రదేశంలోకి ప్రవేశించి కాల్పులు జరిపే సీన్ చిత్రీకరిస్తున్నారు. అయితే చిన్నపాటి పొరపాటు జరుగడంతో అతడి ఒంటికి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం కెమెరాలో రికార్డయింది. దీన్ని నిర్మాత సాండ్రా థామస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

టోవినో థామస్ డెడికేషన్‌కు హాట్సాఫ్

‘‘మంటలు అంటుకున్నా కూడా టొవినో థామస్ తన యాక్షన్ ఆపలేదు. సినిమా పట్ల అతడికి ఎంత పాషన్ ఉందో అర్థమైంది. అతడి డెడికేషన్‌కు హాట్సాఫ్. ఇందులో ఫైట్ సీక్వెన్స్ అన్నీ ఎలాంటి డూప్ లేకుండా చేస్తున్నాడు. టోవినో థామస్ డూప్ లేకుండా చేసిన మరిన్ని స్టంట్ వీడియోలు త్వరలో విడుదల చేస్తాం'' అని నిర్మాత తెలిపారు.

ఆందోళన చెందాల్సిన స్థాయిలో గాయాలు కాలేదు

ఆందోళన చెందాల్సిన స్థాయిలో గాయాలు కాలేదు

ఒంటిపై కాలిన గాయాలు కావడంతో అతడికి వెంటనే సెట్స్‌లోనే చికిత్స చేశారు. అయితే ఆందోళన చెందాల్సిన స్థాయిలో గాయాలు కాలేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, మంటలు అంటుకున్న వెంటనే చిత్రబృందం స్పందించడంతో వెంటనే ఆర్పగలిగామని వెల్లడించారు.

డూప్‌తో చేయడానికి ఇష్టపడలేదు

డూప్‌తో చేయడానికి ఇష్టపడలేదు

‘ఎడక్కడ్ బాటలియన్ 06' చిత్రంలో టోవినో థామస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే కొన్ని రిస్కీ స్టంట్లు డూప్‌లతో చేయించాలని చూసినా... అందుకు అతడు ఒప్పుకోలేదని చిత్ర బృందం వెల్లడించింది. ఇకపై స్టంట్స్ విషయలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

ఎడక్కడ్ బాటలియన్ 06

ఎడక్కడ్ బాటలియన్ 06

‘ఎడక్కడ్ బాటలియన్ 06' చిత్రం కొన్ని రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పి బాలచంద్రన్ కథ అందించారు. ఇందులో ఆయన టోవినో తండ్రి పాత్రలో కూడా నటిస్తుండటం విశేషం. తల్లి పాత్రను రేఖ పోషిస్తోంది. జాయ్ మాథ్యూ, సుదీష్, సంయుక్త మీనన్, అబు సలీమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: malayalam మలయాళం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X