బిగ్‌బాస్‌కు షాక్.. ఉద్యోగుల సస్పెన్షన్..రియాలిటీ షో నిలిపివేత?

మలయాళం బిగ్‌బాస్ సీజన్ 2 రియాలిటీ షో పరిస్థితి అయోమయంలో పడింది. అనేక వివాదాలతో సాగుతున్న ఈ షోను తాత్కాలికంగా రద్దు చేసే యోచనలో నిర్వాహకులు ఎండెమోల్ షైన్ ఇండియా ఉన్నారు. ఇప్పటికే ఆ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు. అయితే రంజిత్ కుమార్‌ను ఎలివేట్ చేయడం వల్ల ఎగిసి పడుతున్న నిరసనల కారణంగా ఆపివేస్తున్నారా? లేక కరొనావైరస్ కారణంగా నిలిపివేస్తున్నారా? అనే ప్రశ్నలు మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ఎందుకంటే..

వినోద పరిశ్రమపై కరోనా ప్రభావం

వినోద పరిశ్రమపై కరోనా ప్రభావం

వినోద పరిశ్రమపై కరోనా ప్రభావం గట్టిగానే పడుతున్నది. ఇప్పటికే పలు షోల షూటింగ్‌ను ఇప్పటికే వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు సెలవులు ప్రకటించారు. తాజాగా ఈ సెగ మలయాళ బిగ్‌బాస్‌కు కూడా చేరిందనేది స్పష్టంగా కనిపిస్తున్నది.

ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

బిగ్‌బాస్ రియాలిటీ షోలను నిర్వహించేది ఎండెమాల్ షైన్ ఇండియా. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు స్వచ్ఛందంగా విరామం ప్రకటిస్తున్నాం. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, సాంకేతిక సిబ్బందిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. కొవిడ్-19 వైరస్ కారణంగా ఉద్యోగుల భద్రతను, క్షేమాన్ని ప్రయారిటీగా భావిస్తున్నాం అని ఎండెమాల్ షైన్ ఓ ప్రకటనలో తెలిపింది.

కరోనా ముప్పు వల్లే

కరోనా ముప్పు వల్లే

కరోనా ముప్పును నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న జాగ్రత్తలు, చర్యలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నామని ఎండెమాల్ షైన్ ఇండియా పేర్కొన్నది. తమ సంస్థ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఎదురవుతున్న సవాళ్లను ఉద్యోగులు అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాం అని అన్నారు.

బిగ్‌బాస్‌పై నీలినీడలు

బిగ్‌బాస్‌పై నీలినీడలు

అయితే ఉద్యోగులపై సస్పెన్షన్ విధించినట్టు ప్రకటించారు గానీ.. బిగ్‌బాస్ షోను నిలిపివేస్తున్నట్టు ప్రకటించలేదు. అయితే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. బిగ్‌బాస్ షోను నిర్వహించాలంటే ఎక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరమనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే మలయాళ బిగ్‌బాస్ షోను నిలిపివేస్తారా? లేదా అనేది ఒకట్రెండు రోజుల్లో తెలిపే అవకాశం ఉంది.

మా నిరసనల వల్లే పీచేమూడ్

మా నిరసనల వల్లే పీచేమూడ్

ఎండెమాల్ ప్రకటనపై బిగ్‌బాస్ పార్టిసిపెంట్, వివాదాస్పద సెలబ్రిటీ రంజిత్ కుమార్ అభిమానులు ఎద్దేవా చేశారు. బిగ్‌బాస్‌ షో నుంచి రంజిత్ కుమార్‌ను తొలగించడం వల్ల నిరసనలు భారీగా వ్యక్తమవుతున్నాయి. వాటిని ఎదుర్కొనలేక షోను క్యాన్సిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై దండెత్తుతున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Mahesh Babu To Host Bigg Boss Telugu After Jr NTR,Nani & Nagarjuna
రంజిత్ పచ్చి కారం ముద్దతతో

రంజిత్ పచ్చి కారం ముద్దతతో

గతవారం రోజుల క్రితం టీచర్, స్టూడెంట్ టాస్క్‌లో రేష్మా అనే సెలబ్రిటీపై రంజిత్ కుమార్ అనుచితంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఈ టాస్క్ సందర్భంగా పచ్చి కారం ముద్దను రేష్మా కళ్లలో రంజిత్ కుమార్ పెట్టడంతో ఆమె దారుణమైన పిరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో రంజిత్ కుమార్‌ను షో నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రంజిత్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X