Pushpa 2: పుష్ప 2 రూమర్లకు తెర దించిన బన్వర్ సింగ్.. లేటేస్ట్ లుక్‌తో అదరగొట్టిన పాహద్ ఫాజిల్

దక్షిణాది సినీ పరిశ్రమలో అద్బుతమైన టాలెంట్‌‌తో కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా రాణిస్తున్న హీరో పహాద్ ఫాజిల్. పుష్ప మూవీతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తాజాగా ఆయన ఆవేశం సినిమాలో విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్న ఆయన కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఆగస్టు 8వ తేదీన ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ మేకర్స్, చిత్రయూనిట్ ఫ్యాన్స్ ఓ కానుకను అందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా పుష్ప 2 సినిమా చుట్టూ అనేక రూమర్లు, గాసిప్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ నింపాదిగా కొనసాగుతుండటంతో నటుడు ఫహాద్ పాజిల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం ఆయన కేటాయించిన డేట్స్ కూడా పూర్తయ్యాయి. దాంతో ఇక ఈ సినిమా షూటింగుకు డేట్స్ కేటాయించలేను అని చెప్పేసి ప్రాజెక్టు నుంచి వాకౌట్ చేశారనే వార్తలు వచ్చాయి.

Fahadh Faasil look of Banwar Singh Shekawat of Pushpa 2 released on his Birth Day

అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ.. చిత్ర యూనిట్ ఆయన బర్త్ డే సందర్భంగా షెకావత్ లుక్‌ను రిలీజ్ చేసి తమ అభిమానాన్నిచాటుకొన్నాడు.ఒక చేతిలో గన్.. మరో చేతిలో గొడ్డలితో ఆయన తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

పుష్ప ది రైజ్‌లో పహాద్ కనిపించింది కొంత సేపే అయినప్పటికీ..ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రం కేక పెట్టించింది. సినిమాను మరో మలుపు తిప్పి పార్ట్ 2పై అంచనాలు పెంచేలా చేసింది. ఇక సెకండ్ పార్టులో బన్వర్ సింగ్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుందనే విషయం అందర్నీలోని ఆసక్తిని రేపింది.

Fahadh Faasil look of Banwar Singh Shekawat of Pushpa 2 released on his Birth Day

ఇదిలా ఉండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప: ది రూల్ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ప్రేక్షకుల చనాలకు ఏ మాత్రం తగ్గకుండా అందించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. భారీగా నటీనటులు పాల్గొంటున్నారు.పతాక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun fahadh faasil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X