పుష్ప 2తో పెద్ద గుణపాఠం.. ఫహాద్ పాజిల్ సంచలన కామెంట్

మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్, తమిళ స్టార్ కమెడియన్ వడివేలు కలిసి నటించిన చిత్రం మారీసన్. ఈ సినిమాకు వీ కృష్ణమూర్తి కథను అందించగా, సుదీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరీ నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫాహద్ ఫాజిల్ పలు విషయాలు ప్రస్తావించారు. ఆయన చెప్పిన విషయాలు, ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

మారీసన్ సినిమాలో కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితారా తదితరులు నటించారు. ఈ సినిమాకు కళై సెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 25వ తేదీన రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా గురించి ఫాహద్ మాట్లాడుతూ..

Fahadh Faasil

మారీసన్ సినిమా స్క్రిప్టును దర్శకుడు మలయాళం కోసం వినిపించాడు. కానీ వడివేలు సార్ ఒప్పుకొన్న తర్వాత నేను ఈ సినిమాను తమిళంలో చేయడానికే మొగ్గు చూపాను. తమిళంలో కామెడీ సినిమాను చేయాలని అనుకొన్నాను. మారీసన్ సినిమా వడివేలు వల్ల చేయాల్సి వచ్చింది. ఈ సినిమా చూస్తే డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది అని ఫాహద్ ఫాజిల్ వెల్లడించారు.

నా జీవితంలో థియేటర్‌లో చూసిన సినిమా భాషా. స్కూల్‌ నుంచి బంక్ కొట్టి హౌస్‌ఫుల్ అయిన థియేటర్‌లో చూసిన మొట్టమొదటి మూవీ. ఊటీలో చదువుకొనేటప్పుడు అలా చూశాను. సిస్టర్ అడ్మిషన్ కోసం ప్రిన్స్‌పాల్ రూమ్‌లోకి వెళ్లి మాణిక్యం అని చెప్పిన సీన్ గూస్‌బంప్స్ క్రియేట్ చేశాయి. అప్పటి నుంచి సినిమా అంటే నాకు పిచ్చిగా మారింది అని ఫాహద్ ఫాజిల్ చెప్పారు.

గతేడాది పెద్ద సినిమాతో నేను ఫెయిల్ అయ్యాను. ఆ సినిమా పేరు ఎత్తడానికి ఇష్టం లేదు. దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు. కానీ ఆ సినిమా షూటింగులో కొన్ని విషయాలు కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఆ మూవీ నుంచి గుణపాఠం నేర్చుకొన్నాను. అక్కడే దానిని వదిలేశాను. నా క్యారెక్టర్ విషయంలో చాలా పెద్ద తతంగమే జరిగింది. ఎందుకు అలా జరిగిందో నాకు అర్ధం కాలేదు అని ఫాహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సినిమా పుష్ప 2 అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

గతంలో కూడా పుష్ప 2 సినిమా షూటింగ్‌లో తనకు జరిగిన సంఘటనల గురించి చెప్పారు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ విషయంలో టీమ్ వ్యవహరించిన తీరు బాధించింది. కొన్నిసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాను. కానీ వారు ఒప్పుకోకపోవడంతో చేసేంది ఏమీ లేక అందుకే తాను మధ్యలోనే వచ్చేశాను అన్నారు. అయితే ఈ సినిమాలో ఫాహద్ ఇమేజ్ తగిన విధంగా క్యారెక్టర్ డిజైన్ చేయలేదని విమర్శలు కూడా వినిపించాయి.

More from Filmibeat

Read more about: pushpa 2 Maareesan fahadh faasil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X