ప్రముఖ దర్శకుడు అరెస్ట్.. ఐదు కోట్లు చీట్ చేసి!
ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ విఎ శ్రీకుమార్ మీనన్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యాపార సంస్థను 5 కోట్ల రూపాయలకు మోసం చేశాడనే కారణంగా ఆయనని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 'ఒడియన్' సినిమాతో పేరు తెచ్చుకున్న శ్రీ కుమార్ మీనన్ ను గురువారం రాత్రి ఉత్తర పాలక్కాడ్ జిల్లాలోని తన ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నామని, ఆయన అరెస్టును శుక్రవారం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సినిమాను నిర్మించాలనే నెపంతో ఐదు కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినందుకు గాను చీటింగ్ కేసులో అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఆయన అప్ప్లై చేసిన ముందస్తు బెయిల్‌ను జిల్లా కోర్టు తిరస్కరించడంతో ఆయనని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 420 కింద ఆయన మీద కేసు నమోదు చేసినట్లు అలప్పుజ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ డి కె ప్రిథ్యూరాజ్ ప్రెస్ కి సమాచారం ఇచ్చారు. ప్రఖ్యాత జ్యువెలర్స్‌తో సహా పలు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనలు చేసిన యాడ్ ఫిలిం మేకర్ గా పేరుగాంచిన శ్రీకుమార్ మీనన్, నటి మంజు వారియర్‌ను సోషల్ మీడియాలో బెదిరించి, ఆమె గురించి తప్పుడు పోస్టులు పెట్టినందుకు 2019లో కూడా ఒకసారి అరెస్టయ్యాడు. తరువాత వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదలయ్యాడు.

తాజాగా శ్రీవల్సం బిజినెస్ గ్రూపుకు చెందిన రాజేంద్రన్ పిళ్ళై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ అయ్యారు. అందుతున్న సమాచారం మేరకు 2006 నుండి ఇప్పటి వరకు జరిగిన ఆర్ధిక లావాదేవీల గురించి మిస్టర్ పిళ్ళై దర్శకుడిపై ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు ప్రకారం, శ్రీకుమార్ ఒక సినిమా చేస్తాననే నెపంతో రాజేంద్రన్ పిళ్ళై నుండి ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కానీ సినిమా ఊసు మాత్రం ఎత్తడం లేదు. చానాళ్ళ పాటు ఓపిక పట్టిన ఆయన చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications











