తెలుగులో ‘లవర్స్ డే’గా ప్రియా వారియర్ మూవీ, రిలీజ్ ఎప్పుడంటే..?
2018 ఇండియాలో బిగ్గెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ ఎవరు? అంటే ప్రియా వారియర్. ఆమె నటిస్తున్న మలయాళ చిత్రం 'ఓరు అడార్ లవ్' అనే చిత్రంలోని ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అందులో ప్రియా కన్నుగీటుతున్న సీన్ కుర్రకారుకు తెగ నచ్చేయడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ కేరళ బ్యూటీ.
'ఓరు అడార్ లవ్' ప్రియా వారియర్ నటిస్తున్న తొలి చిత్రం. ఆమెకు ఇంటర్నెట్ ద్వారా ఎనలేని పాపులారిటీ దక్కడంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని 'లవర్స్ డే' పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

'ఓరు అడార్ లవ్'(లవర్స్ డే) మూవీ గతేడాదే విడుదలవ్వాల్సి ఉండగా... పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రియా వారియర్‌కు పబ్లిసిటీ బాగా పెరగడంతో సినిమాలో ఆమె పాత్రలో మార్పులు చేసి నిడివి పెంచారట.
ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్, సియద్ షాజహాన్, నూరిన్ షరీఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని గురురాజ్, వినోద్ రెడ్డి ఎస్‌బి సినిమాస్ బేనర్లో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











