‘పడక గదిలో కోరిక తీరుస్తేనే ఆఫర్.. సినీ పరిశ్రమలో క్రిమినల్స్.. మహిళలపై నిర్మాత, దర్శకుల దారుణాలు’
సినీ పరిశ్రమలో కోరికలు తీర్చందే వేషాలు, ఆఫర్లు ఇవ్వమనే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. మీటూ లాంటి ఉద్యమాలు ఎన్ని వచ్చినా వాటికి ముగింపు ఎక్కడ? ఎప్పుడు అనే సమాధానం దొరకడం కరువైంది. తెలుగు, బాలీవుడ్, మలయాళ పరిశ్రమలో ఈ దుష్టాచారం ఎక్కువగా కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా మహిళలపై ఇలాంటి దారుణాలు అరికట్టడానికి వేసిన కమిటీలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..
మలయాళ సినీ పరిశ్రమలో దిలీజ్ ఇతర నటీనటులుపై వెల్లువెత్తిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఓ నటిపై అత్యాచారం, హత్యకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాస్టింగ్ కౌచ్ తదితరల అంశాలపై దర్యాప్తుకు హేమ కమిటీని నియమించారు.

గత కొద్ది నెలులు సినీ, మెడికల్, ఇంజీనిరింగ్, టీచింగ్ లాంటి వృత్తుల్లో ఇలాంటి దారుణాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చాయి. తాజా రిపోర్టును మలయాళ ముఖ్యమంత్రికి హేమ కమిటి అందజేశారు. దాదాపు 233 పేజీలతో కూడిన రిపోర్టును కమిటీ సభ్యులు అందజేశారు.
హేమ కమిటీ విచారణలో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. చాలా మంది యువ తారలు, నటీమణులు చెప్పిన విషయాలు ఒళ్లు జలదరించజేశాయనే విషయాన్ని కమిటీ సభ్యులు తెలిపారు. తమ కోరికను తీర్చితేనే ఆఫర్లు, సినిమాలో అవకాశాలు ఇస్తామని బాహాటంగా చెప్పారు. కొంత మంది నిర్మాతలు, దర్శకులు కంప్రమైజ్ అవ్వమని బహిరంగంగానే తమ కోరికల చిట్టాను బయటపెట్టారు అని అన్నారు.

హేమ కమిషన్ రిపోర్టులో మరో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మలయాళ పరిశ్రమను కొంత క్రిమినల్స్ నడుపుతున్నారు. దాంతో పరిశ్రమలో లైంగిక వేధింపులు పెద్ద ఎత్తున్న కొనసాగుతున్నాయి. వాటిని అరికట్టలేకపోతే పరిశ్రమపై దుష్ప్రభావం పడుతుంది అని హేమ కమిటీ కొన్ని కీలక సూచలను చేసింది.


Click it and Unblock the Notifications











