ఫ్లయిట్‌లో హీరోయిన్‌కు చేదు అనుభవం.. తోటి ప్రయాణికుడు వేధింపులు తట్టుకోలేక అలాంటి నిర్ణయం!
మలయాళ హీరోయిన్ దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి కోచికి వెళ్తున్న ప్లయిట్‌లో తను ప్రయాణిస్తున్న సమయంలో తోటి ప్రయాణికుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కోచి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తాను ముంబై నుంచి కోచికి వెళ్తుండగా తోటి ప్రయాణికుడు అసభ్యంగా, అమర్యాదకరంగా ప్రవర్తించాడు. తప్ప తాగిన ఆ వ్యక్తి తనను చెప్పుకోలేని విధంగా వేధింపులకు గురిచేశాడు. కోచికి వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లయిట్‌లో ఈ సంఘటన చోటు చేసుకొన్నది అని తన లేఖలో పేర్కొన్నారు.

తనకు ఎయిర్ ఇండియా ఫ్లయిట్‌లో ఎదురైన సంఘటన గురించి తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో సుదీర్ఘంగా లేఖను పోస్టు చేసింది. తనతో తోటి ప్రయాణికుడు చేసిన వేధింపులతో తాను చాలా ఇబ్బంది పడటమే కాకుండా మానసికంగా బాధపడ్డాను. అయితే ఈ విషయాన్ని ఫ్లయిట్‌లో సిబ్బందికి చెప్పిన వారు సరిగా పట్టించుకోలేదు. గ్రౌండ్ స్టాఫ్‌కు ఫిర్యాదు చేసినా వాళ్లు చాలా తేలికగా తీసుకొన్నారు.

తోటి ప్రయాణికుడు ఇబ్బందులకు గురి చేస్తుంటే.. ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకెళ్లాను. తన సీట్‌ను మరో చోటికి మార్చమని అడిగితే వారు పట్టించుకోలేదు. దాంతో ఫ్లయిట్ ల్యాండింగ్ అయిన తర్వాత ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేస్తే.. పోలీసులకు కంప్లయింట్ ఇవ్వమని సలహా ఇచ్చారు అని తన లేఖలో వెల్లడించారు.
కోచి ఎయిర్‌పోర్టు అధికారులు సూచనల మేరకు పోలీసులకు ఈమెయిల్ ద్వారా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. తన సీట్‌లో కూర్చొని చాలా దారుణంగా బిహేవ్ చేశారు. తనతో వాదనకు దిగి దుర్బాషలు ఆడారు. తన శరీరాన్ని చూస్తూ దారుణంగా ప్రవర్తించాడు అని దివ్య ప్రభ వెల్లడించింది.

అయితే ప్రయాణికుడు చేసిన అల్లరి సమయంలో తాను కోరినట్టు ఎయిర్ హోస్టెస్ సీటు మార్చితే బాగుండేది. కానీ ఎయిర్ హోస్టెస్ ఏ మాత్రం స్పందించలేదు. తోటి ప్రయాణికుడు తనతో దారుణంగా ప్రవర్తించినా వారు పట్టించుకోలేదు అని దివ్య ప్రభ ఆరోపణలు చేసింది.


Click it and Unblock the Notifications











