ఆడిషన్స్‌కు పిలిచి ఒళ్లంతా తడిమారు.. చెప్పలేనిచోట పైశాచికంగా.. యువ హీరోయిన్‌కు చేదు అనుభవం

సినిమా పరిశ్రమలో వేషం కోసం నిర్మాతలు, దర్శకుల పడక గదిలోకి వెళ్లాల్సి వచ్చిందని, ప్రముఖులు వేధించారనే వార్తలు మీడియాలో అడపాదడపా వినిపిస్తుంటాయి. ఆ మధ్య ఇండియా వైడ్‌గా మీటూ ఉద్యమంలో సినీ తారల వ్యధలు కథలు కథలుగా పుట్టుకొచ్చాయి. పలువురు ప్రముఖులపై భారీ ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఉద్యమం తగ్గుముఖం పట్టిందనుకొంటున్న సమయంలో మరోసారి మలయాళ పరిశ్రమలో మీటూ ప్రకంపనలు కనిపించాయి. యువ హీరోయిన్ మాళవిక శ్రీనాథ్ చేసిన సంచలన ఆరోపణల వివరాల్లోకి వెళితే..

లైంగిక వేధింపుల వ్యవహారాన్ని..: మలయాళ చిత్ర పరిశ్రమలో మాళవిక శ్రీనాథ్ వర్థమాన తారగా రాణిస్తున్నారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధురం, సాటర్ డే నైట్ అనే చిత్రాల్లో నటించిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మంజు వారియర్ నటించే చిత్రంలో అవకాశం రావడంతో ఆడిషన్స్‌కు వెళ్లాను. మంజు వారియర్ కూతురు పాత్ర కోసం నన్ను ఆడిషన్ అడిగారు. ఆ సమయంలో ఆ చిత్ర యూనిట్ నుంచి మాటల్లో చెప్పలేని లైంగిక వేధింపులకు గురయ్యాను. సినిమా పరిశ్రమలో వేషం కోసం శారీరక సుఖం అనేది తప్పనిసరి అని ఆమె అన్నారు.

Malavika Sreenath

మంజు వారియర్ సినిమా కోసం ఆడిషన్స్ : మంజు వారియర్ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ సమయంలో విపరీతమైన బాధలు అనుభవించాను. అయితే నేను అనుభవించిన క్షోభను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఆడిషన్ పేరుతో చెప్పలేని చోట చేతులు వేసి పైశాచికంగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు నాకంటూ పరిశ్రమలో ఓ స్థానం, గుర్తింపు ఉంది. ఇప్పుడు చెప్పడం వల్ల నా బాధను అర్ధం చేసుకొంటారనే ధైర్యం వచ్చింది. అందుకే ప్రస్తుతం నేను ఆ విషయాన్ని బయటపెట్టాలని అనుకొంటున్నాను అని మాళవిక శ్రీనాథ్ చెప్పారు.

నా తల్లిని, సోదరిని బయటకు పంపించి.. : మాళవిక శ్రీనాథ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం. మంజు వారియర్ సినిమాలోని పాత్ర కోసం ఆడిషన్స్‌కు పిలిచారు. మంజు వారియర్ కూతురు పాత్ర కోసమని చెప్పి ఇన్నోవాలో నన్ను, నా తల్లి, సోదరిని తీసుకెళ్లారు. నా తల్లిని, సోదరిని బయటే ఉండమని చెప్పారు. ఓ వ్యక్తి నాతో మిస్ బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. పది నిమిషాలు మారు మాట్లాడుకుండా, నిలోచమని చెప్పారు. దాంతో నాకు భయం వేసింది. నేను ఏడవడం మొదలుపెట్టాను అని మాళవిక శ్రీనాథ్ చెప్పారు.

Malavika Sreenath

గది నుంచి బయటపడి.. పారిపోయి.. : అలాంటి పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తోయలేదు. ఆ వ్యక్తి చేతిలో ఉన్న కెమెరాతో నన్ను షూట్ చేయడం మొదలుపెట్టాడు. కెమెరాను లాక్కొనే ప్రయత్నం చేశాను. అతడి చేతిలో నుంచి కెమెరా కిందపడిపోతుండటంతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే నేను రూమ్ నుంచి పారిపోయాను. నేను ఏడుస్తుండటం చూసి నా పరిస్థితిని నా తల్లి, సోదరి అర్ధం చేసుకొన్నారు. వెంటనే పరుగున రోడ్డుపై ఆగి ఉన్న బస్‌లోకి ఎక్కాను. ఆ బస్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను. బస్సులోనే ఏడుస్తూ ఉండిపోయాను అని మాళవిక శ్రీనాథ్ చెప్పారు.

ఇలా పలుమార్లు లైంగిక వేధింపులు : నా కెరీర్ ఆరంభంలో సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నాలుగైదు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాను. అయితే నేను వెళ్లిన ఆడిషన్స్ మంజు వారియర్ సినిమా కోసం కాదని తెలిసింది. నాకు సినిమా పరిశ్రమ అంటే ఏమిటో ఆ సమయంలో పూర్తిగా తెలియదు. ఆ సమయంలో మంజు వారియర్ సినిమాలో నటించబోతున్నాననే ఆనందం తప్ప..మరోటి నా మనసులో రాలేదు. అలాంటి అనుభవాలను తప్పించుకొని సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొంటున్నాను అని మాళవిక శ్రీనాథ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X